డిసెంబర్‌లో పీజీ ప్రథమ సంవత్సర సెమిస్టర్ పరీక్షలు: ఉస్మానియా యూనివర్సిటీ
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఓయూ పరిధిలో వివిధ పీజీ కోర్సులు చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులకు 1, 2 సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్) డిసెంబర్‌లో నిర్వహించనున్నట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
అపరాధ రుసుము లేకుండా ఈ నెల 19వ తేదీ వరకు, రూ.300 అపరాధ రుసుముతో 24 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని వివరించారు. కరోనా కారణంగా విద్యార్థులకు సమీపంలో ఉండే ఆయా జిల్లా కేంద్రాలలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చని సూచించారు. పరీక్ష సమయాన్ని మూడు నుంచి రెండు గంటలకు కుదించినట్లు చెప్పారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Published date : 10 Nov 2020 02:56PM