డిసెంబర్ 5న ఏపీఆర్జీయూకేటీ సెట్-2020 ప్రవేశ పరీక్ష
Sakshi Education
సాక్షి, అమరావతి: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్‌జ అండ్ టెక్నాలజీ పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష (ఆర్జీయూకేటీ సెట్-2020) డిసెంబర్ 5న (శనివారం) జరగనుంది.
ఈసెట్‌ను గత నెల 28నే నిర్వహించాల్సి ఉండగా, తుపాను తీవ్రత వల్ల వాయిదా వేశారు. డిసెంబర్ 5న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ పరీక్ష జరుగుతుంది. ఇదివరకే ప్రకటించిన పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి మార్పులేదని సెట్ కన్వీనర్ డి.హరినారాయణ తెలిపారు. పరీక్షకు 88,961 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, ఏపీతో పాటు తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్‌లలో మొత్తం 637 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Published date : 04 Dec 2020 04:23PM