Skip to main content

డిసెంబర్ 23, 24న ఎంబీబీఎస్, బీడీఎస్ రెండో విడత కౌన్సెలింగ్: కాళోజీవర్సిటీ

సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది.
ఈ నెల 23 నుంచి 24వ తేదీ వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్ పొంది కాలేజీలో చేరని, ఆలిండియా కోటాలో సీటు పొంది చేరిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులని స్పష్టం చేసింది. వివరాలకు www.knruhs.telangana.gov.in  ను సంప్రదించాలని సూచించింది.
Published date : 24 Dec 2020 05:24PM

Photo Stories