డిసెంబర్ 12 వరకు ఐసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా ఐసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈ నెల 12 వరకు నిర్వహించనున్నట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ ఓ ప్రకటనలో తెలిపారు.
విద్యార్థులు ఈ నెల 13 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. ఇప్పటివరకు 10,232 మంది విద్యార్థులు ఫీజు చెల్లించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక ఈసారి రాష్ట్రంలోని 262 ఎంబీఏ కాలేజీల్లో 31,084 సీట్లు అందుబాటులో ఉండగా, అందులో కన్వీనర్ కోటాలో 22,146 సీట్లను భర్తీ చేయనున్నట్లు వివరించారు. ఇక 35 ఎంసీఏ కాలేజీల్లో 2,417 సీట్లు అందుబాటులో ఉండగా.. 1,893 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తామన్నారు.
Published date : 09 Dec 2020 03:03PM