Skip to main content

డిగ్రీ, ఇంజనీరింగ్‌లో ఈ ఏడాది నుంచే‘ఆనర్స్‌’ అమలు: విద్యాశాఖ మంత్రి సురేష్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ఆనర్స్‌ పద్ధతిని ప్రవేశపెట్టనున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.
ఆయా కోర్సుల్లో ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. సీఎం జగన్‌ సమీక్ష అనంతరం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

ఆ వివరాలు ఇవీ..
  • విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేలా ప్రోత్సహించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా వివిధ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నందున ఉన్నత విద్యలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ 90 శాతానికి పెరగాలి. 3 ఏళ్ల డిగ్రీ, నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీ కోర్సులు ఈ ఏడాది నుంచే అమలు. వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లోనూ ఆనర్స్‌ విధానం.
  • నాలుగేళ్ల బీఈ, బీటెక్‌ కోర్సుల్లో 10 నెలలు అప్రెంటిస్‌షిప్‌ విధానం. కనీసం 20 క్రెడిట్లు సాధిస్తే బీటెక్‌ ఆనర్స్‌ డిగ్రీ. ఉదాహరణకు బీటెక్‌ మెకానికల్‌ చేస్తూ కంప్యూటర్‌ సైన్సులో కొన్ని అంశాలను అధ్యయనం చేయడం ద్వారా 20 క్రెడిట్లు సాధిస్తే ఆ విద్యార్థికి బీటెక్‌ ఆనర్స్‌ ఇవ్వాలని సూచన.
  • ప్రకాశంలో ఉపాధ్యాయ విద్య కోర్సుకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక వర్సిటీ, విజయనగరంలో మరో కొత్త వర్సిటీని ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని సీఎం ఆదేశం. టీచర్‌ ట్రైనింగ్‌ వర్సిటీకి జిల్లాల్లోని టీచర్‌ ట్రైనింగ్‌ సంస్థలు అనుబంధంగా ఉంటాయి.
  • సెప్టెంబర్‌ 3వ వారం నుంచి ఎంసెట్‌ సహా వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణ.
Published date : 07 Aug 2020 01:33PM

Photo Stories