Skip to main content

దేశంలోనే `ఐఎస్‌బీ` నంబర్‌–1

సాక్షి, హైదరాబాద్‌: గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ మరో అరుదైన గుర్తింపు సాధించింది.
ఫైనాన్షియల్‌ టైమ్స్‌–2020 అక్టోబ‌ర్ 26వ తేదీన‌ ప్రకటించిన ఈఎంబీఏ ర్యాంకింగ్స్‌లో పీజీ పీమ్యాక్స్‌ కోర్సు నిర్వహణతో దేశంలోకే ఐఎస్‌బీ మొదటి స్థానం పొందగా, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 53వ స్థానం పొందింది. ఐఎస్‌బీలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్స్, వ్యాపార యజమానులకు కనీసం 10 ఏళ్ల అనుభవం ఉన్న 15 నెలల కాలపరిమితితో కూడిన గ్లోబల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ స్థాయి ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. 2017 పీజీ పీమ్యాక్స్‌ క్లాస్‌ నుంచి ఐఎస్‌బీ పూర్వ విద్యార్థులు ఈ ఏడాది ర్యాంకింగ్‌ కోసం సర్వే చేయబడ్డారు. ప్రధానంగా లక్ష్యాల సాధన, జీతాల పెంపుదల, ప్రస్తుత జీతాలు, కెరియర్‌ ప్రొగ్రామ్స్‌ నిర్వహణ, మహిళా ఫ్యాకల్టీ, విద్యార్థినులు, అంతర్జాతీయ ఫ్యాకల్టీ, అంతర్జాతీయ విద్యార్థులు వంటి అంశాలపై పరిశీలించి ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ర్యాంక్‌లను ప్రకటించింది. గతేడాది 52వ ర్యాంక్‌ పొందగా ఈ ఏడాది 53 వస్థానం పొందగలిగింది. తాజా ర్యాకింగ్స్‌ వల్ల ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ ప్రాముఖ్యతతో పాటు ఐఎస్‌బీ ప్రాధాన్యత పెరిగిందని డీన్‌ ప్రొఫెసర్‌ రాజేంద్ర శ్రీవాత్సవ అన్నారు.
Published date : 27 Oct 2020 02:02PM

Photo Stories