చదువుతో పాటు.. ఉపాధి కూడా
Sakshi Education
సాక్షి, అల్లాదుర్గం (మెదక్): బాలికల విద్యకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ విద్యాలయాలు (కేజీబీవీ) మంచి ఫలితాలు సాధిస్తున్నాయి.
చదువుల్లో శభాష్ అనిపించుకుంటున్న విద్యార్థినులు స్వయం ఉపాధిలోనూ తమకు సాటిలేరని నిరూపించుకుంటున్నారు. స్వయం ఉపాధిలో భాగంగా పలురకాల ఉత్పత్తులు తయారుచేశారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో పురస్కారం కూడా సాధించారు. కుట్టుశిక్షణ, అల్లికలు, బ్యాంగిల్స్, చెవికమ్మల తయారీలో శిక్షణ పొంది విద్యార్థినులే వాటిని తయారు చేస్తున్నారు. ఇది అల్లాదుర్గం కస్తూర్బా గాంధీ విద్యాలయం బాలికలు సాధించిన ఘనత.
అల్లాదుర్గం కేజీబీవీలో బాలికలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఒకేషనల్ కోర్సును అందుబాటులోకి తెచ్చారు. ఇందులో పనిచేసే వృత్తివిద్యా బోధకులు బాలికలకు వారానికి గంటపాటు ఉపాధిపై శిక్షణ ఇస్తున్నారు. దీంతో విద్యార్థినులు పలు రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇందులో 20 మందిని ఐదు గ్రూపులు చేసి శిక్షణ ఇచ్చారు. మహిళలు చెవులకు పెట్టుకునే కమ్మలు, నాప్‌కిన్ల తయారీ, తలుపులకు వేసే కర్టన్లు, గాజుల తదితరాల్లో శిక్షణ ఇచ్చారు. దీంతో అల్లాదుర్గం కేజీబీవీ విద్యార్థినిలు పలు రకాల చెవి కమ్మలు తయారు చేశారు. అల్లాదుర్గం కేజీబీవీ స్వయం ఉపాధిలో రాష్ట్రస్థాయి ఆవార్డు వచ్చింది. జనవరి నెలలో హైద్రాబాద్‌లో రాష్ట్ర కార్యాలయంలో స్టేట్ ప్రాజెక్టు డెరైక్టర్ శ్రీహారీ చేతుల మీదుగా ప్రత్యేక అధికారి జ్యోతి, ఒకేషనల్ టీచర్ శివలక్ష్మిలు అవార్డు అందుకున్నారు. తెలంగాణలో 400 కేజీబీవీలుండగా ఇందులో 32 ఎంపికయ్యాయి. అందులో నుంచి తిరిగి 10 కేజీబీవీలను ఎంపిక చేశారు. అందులో అల్లార్గం కేజీబీవీకి వొకేషనల్ కోర్సు రాష్ట్ర స్థాయి పురస్కారం వచ్చింది.
నిధుల కొరత..:
స్వయం ఉపాధిపై శిక్షణ ఇచ్చేందుకు ప్రస్తుతం ఈ పాఠశాలను నిధుల కొరత వేధిస్తోంది. గతంలో కొలంబియా, యువనేస్తం సంస్థలు అవసరమైన సామగ్రిని సరఫరా చేసేవారు. విద్యార్థినులు తయారు చేసిన వస్తువులు ఆ సంస్థలే తీసుకెళ్లి మార్కెట్‌లో విక్రయించేవి. గడించిన లాభంలో కొంతమొత్తం పాఠశాలకు, మరికొంతమొత్తం విద్యార్థినులకు అంద జేసేవారు. ఏడాది నుంచి ఈ సంస్థలు ఎలాంటి సామగ్రి ఇవ్వడం లేదు.
స్వయం ఉపాధి కోసం:
విద్యార్థినులకు స్వయం ఉపాధి కోసం ఒకేషనల్ కోర్సు ప్రవేశపెట్టాం. బాలికలు చదువు పూర్తయిన తర్వత వారి కాళ్ల మీద వారు నిలబడి ఉపాధి పొందేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంత గానో ఉపయోగపడతాయి. బాలికలు చదువుకుంటూనే విశ్రాంత సమయంలో గంట సమయాన్ని కేటాయిస్తున్నారు.వారి జీవితంలో స్వయం ఉపాధి పథకాలు ఎంతగానే ఉపయోగపడ్డాయి.
- జ్యోతి, ప్రిన్సిపాల్

Published date : 06 Feb 2020 04:15PM