Skip to main content

భయం వీడితే జయం మనదే..!

కష్టపడేవాడు శ్రామికుడవుతాడు. డైలీ లేబర్ అంటాం కదా. జీవితాంతం కష్టపడుతూనే ఉంటాడు. చనిపోయేదాకా ఎవరో ఒకరికింద పనిచేస్తూ కాలం గడుపుతాడు.
అయితే ఇష్టపడి కష్టపడేవాడు మాత్రం లేబర్‌గా మారడు. లీడర్ (నాయకుడు) అవుతాడు. పది మందిని తన మార్గదర్శకత్వంలో నడిపిస్తాడు. గోల్ ఉన్న వాడు లీడర్ అయితే గోల్ లేనివాడు లేబర్. జయం మన సొంతం కావాలంటే మొదట వీడాల్సింది భయం. ఈనాటి యువకులకు అన్నీ భయాలే. ఎగ్జామ్ భయం. ట్రాఫిక్ భయం, ఇంటర్వ్యూ భయం. ప్రమోషన్ భయం. తోటి విద్యార్థికి తనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకొంటాడేమోననే భయం. ఈ భయం ఓ మానియా. ఇది అత్యంత ప్రమాదకరమైనది. వాస్తవానికి మనం ధైర్యవంతులుగా పుట్టామా పిరికివాళ్లుగా పుట్టామా. ఈ లోకంలో ఎవరూ పిరికివాళ్లుగా పుట్టరు. పుట్టా క కొంతకాలానికి పరిస్థితులనుబట్టి పిరికివాళ్లుగా మారతారు. ఇందుకు ఒక ఉదాహరణ చెప్పుకొందాం. చిన్నప్పుడు మనం బొమ్మలతో ఆడుకొంటుంటాం. ఒకరోజు ఒక పిల్లవాడు బొమ్మ లతో ఆడుకొంటున్నాడు. ఇంతలోకి అక్కడికి ఒక పాము వచ్చింది. అయితే ఆ పిల్లవాడు భయపడతాడు. అస్సలు భయపడడు. ఇంతలోకి అమ్మమ్మో లేక నానమ్మో లేక అక్కడున్న మరెవరో ఆ పామును చూసి వామ్మో అని అరుస్తారు. దీంతో ఆ పిల్లవాడు ఉలిక్కిపడతాడు. అక్కడనుంచి ఆ పిల్లవాడిలో భయం మొదలవుతుంది. ఆ పిల్లవాడు భోజనం చేయకపోతే...అప్పుడు కూడా భయపెడతారు. ఎలా..అమ్మో బూచాడొస్తున్నాడు. అన్నం తినేయ్ అంటుంది అమ్మ. వాడికి బూచాడి భయం పట్టుకొంటుంది. అప్పటినుంచి అన్నం పెట్టాలనుకొన్న ప్రతిసారి వాడి అమ్మ,..బూచాడిని గుర్తు చేస్తుంది. ఇక రాత్రిపూట పిల్లాడు నిద్రపోకుండా అల్లరి చేస్తుంటే అప్పుడు కూడా భయపెడుతుంది. ‘‘రాత్రిపూట దెయ్యాలు తిరుగుతుంటాయ్. నిన్ను పట్టుకుపోతుంది’’ అంటూ అమ్మ హెచ్చరిస్తుంది. ఆ పిల్లాడి భయం ఖాతా లో ఇప్పుడు దయ్యం చేరిపోయింది. ఇలా మెల్లగా ఆ పిల్లవాడు అన్నింటికీ భయపడి పోతుంటాడు. ఈ సందర్భంగా సెయింట్ మాంటిస్సోరి అనే ఓ మహిళ చెప్పిన మాట గుర్తు తెచ్చుకొందాం.‘‘ఈ భూమ్మీద చెడ్డ పిల్లలు ఎవరూ లేరు’’, పిల్లలు పిరికిపందలు గా మారినా లేదా చెడ్డ వారిగా మారినా దానికి ఇద్దరే కారకులు. ఒకరు తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులు. ధైర్యవంతులుగా జన్మించిన మనం అలాగే జీవించాలి. చిన్న చిన్న విషయాలకు సైతం భయపడిపోయి ఆత్మహత్య చేసుకోకూడదు.
Published date : 09 Mar 2020 12:38PM

Photo Stories