బ్రేకింగ్ న్యూస్: గ్రూప్-1 ఇంటర్వ్యూలు రద్దు..అన్ని కేటగిరిల్లోనూ..
Sakshi Education
సాక్షి, విజయవాడ: గ్రూప్-1 రిక్రూట్‌మెంట్‌లో ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో అన్ని కేటగిరిల్లోనూ ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ జూన్ 26వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిపాదన మేరకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్ పరీక్షల్లో సంపూర్ణ పారదర్శకత కోసం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Published date : 26 Jun 2021 01:29PM