Skip to main content

బంప‌ర్ ఆఫ‌ర్‌: ట్విన్‌ బ్రదర్స్‌...ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు జీతం

అమరావతి : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జరిగిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో రికార్డు స్థాయిలో వేతనం పొందారు ఎస్‌ఆర్‌ఎం కాలేజీ విద్యార్థులు.

ఎస్‌ఆర్‌ఎం కాలేజీకి చెందిన కవల సోదరులు సప్తర్షి మంజుదార్‌, రాజర్షి మజుందార్‌లను గూగూల్‌ జపాన్‌ సంస్థ ఎంపిక చేసుకుంది. ఇద్దరికి చెరో రూ. 50 లక్షల వంతున వార్షిక వేతనం ఇచ్చేందుకు అంగీకరించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో గడ్డ నిర్వహించిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఇదే అత్యధికం. అంతేకాదు ఒకేసారి ఇద్దరు కవలలు సమాన వేతనం పొందడం కూడా ఇదే మొదటిసారి.

రూ.50 లక్షల వేతనంతో..
ఇటీవల ఏపీ రాజధాని అమరావతిలో ఉన్న ఎస్‌ఆర్‌ఎం-ఏపీ కాలేజీ క్యాంపస్‌లో తొలి బ్యాచ్‌ బయటకు వస్తోంది. దీంతో కాలేజీలో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ నిర్వహించారు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో విద్యార్థులు పొందిన వేతనం సగటు రూ. 7 లక్షలుగా నమోదు అయ్యింది. కాగా మంజుదార్‌ కవల సోదరులు వేర్వేరుగా రూ. 50 లక్షల వార్షిక వేతనం పొందారు. దీంతో ఇటీవల కాలేజీ యాజమాన్యం సత్కరించి రూ.2 లక్షల రివార్డు అందించింది.

అస‌లు ఊహించలేదు : సప్తర్షి మంజుదార్‌
‘ఈ స్థాయిలో వేతనం పొందుతామని మేము ఎ‍ప్పుడు అనుకోలేదు. స్కూలింగ్‌ నుంచి కాలేజీ వరకు కలిసే చదువుకున్నాం. ఒకే సంస్థలో ప్లేస్‌మెంట్‌ పొందాలని అనుకునే వాళ్లం. ఆ కల ఇంత గొప్పగా నెరవేరుతుందని అనుకోలేదు’ అని సప్తర్షి మంజుదార్‌ అన్నారు.

Published date : 21 Jun 2021 03:40PM

Photo Stories