బాసర ట్రిపుల్ ఐటీకి 1,404 మంది విద్యార్థులు ఎంపిక
Sakshi Education
భైంసా (ముధోల్): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో 2020–21 విద్యా సంవత్సరంలో ఆరేళ్ల ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదలైంది.
పాలిసెట్ అర్హతతో మొదటిసారిగా విద్యార్థులకు సీట్లు కేటాయించారు. గురువారం ట్రిపుల్‌ఐటీలో ఏవో రాజేశ్వర్‌రావు ఎంపికైన 1,404 మంది విద్యార్థుల వివరాలు వెల్లడించారు. అన్ని కేటగిరీల్లో 46 శాతం మంది బాలికలు, 54 శాతం మంది బాలురు సీట్లు సాధించారు. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో ట్రిపుల్‌ఐటీలో 1,500 సీట్లు కేటాయించారు. ప్రత్యేక కేటగిరీ కింద 96 సీట్లు పోను 1,404 మంది విద్యార్థుల జాబితా విడుదల చేశారు. ఎంపిక జాబితాలో క్రమసంఖ్య 1 నుంచి 500 వరకు సెప్టెంబర్ 1న, 501 నుంచి 1,000 వరకు 2న, 1,001 నుంచి 1,404 వరకు 3వ తేదీన మూడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు http://admissions.rgukt.ac.in వైబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Published date : 20 Aug 2021 07:17PM