Skip to main content

బాలికల కోసం 20 శాతం సూపర్‌న్యూమరరీ సీట్లపెంపు

సాక్షి, హైదరాబాద్: సాంకేతిక విద్యను అభ్యసించడంలో బాలికల భాగస్వామ్యం పెంచేందుకు కేంద్రం చర్యలు వేగవంతం చేసింది.
ఇంజనీరింగ్ విద్యపట్ల బాలికలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని, బాలురతో పోల్చుకుంటే బాలికల సంఖ్య చాలా తక్కువగా ఉంటోందని గుర్తించిన కేంద్రం.. ఐఐటీల్లో వారి సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టింది. నాలుగేళ్లలో కనీసం 20 శాతం మంది బాలికలకు అదనంగా సీట్లను ఇవ్వాలని 2017లో నిర్ణయించింది. అందుకనుగుణంగా చర్యలు చేపట్టింది. ఐఐటీ కౌన్సిల్ కూడా అదే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంది. అయితే పలు ఐఐటీలు అప్పట్లో దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. తగిన మౌలిక సదుపాయాలు లేకుండా సూపర్‌న్యూమరరీ సీట్లను సృష్టిస్తే నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటాయని ఆందోళన వెలిబుచ్చాయి. దీంతో ఆ ఒక్క సంవత్సరం మాత్రం సదుపాయాలు ఉన్న ఐఐటీల్లో బాలికల కోసం అదనంగా సీట్లను కేటాయించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆ ఏడాది నుంచి ఐఐటీలు సీట్లను క్రమంగా పెంచుతూ వస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో (2020-21) భారీగా సీట్ల పెంపునకు ఐఐటీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఐఐటీల్లో ఉన్న సీట్లకు అదనంగా 20 శాతం సీట్లను బాలికల కోసమే సూపర్‌న్యూమరరీగా సృష్టించి కేటాయించేందుకు చర్యలు చేపట్టింది.

మూడేళ్లలో సీట్ల పెరుగుదల ఇలా..
2016-17 విద్యా సంవత్సరంలో దేశంలోని ఐఐటీల్లో 10,435 సీట్లు ఉన్నాయి. కేంద్రం నిర్ణయంతో 2017-18లో ఆ సీట్ల సంఖ్య 10,957కు, 2018-19లో 11,326కు, 2019-20లో 13,376కు పెరిగింది. అయితే ఇందులో 2019-20 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటా కింద వెయి్య సీట్ల వరకు ఉన్నాయి. ఇవి మినహాయిస్తే గత మూడేళ్లలో బాలికల కోసమే ఐఐటీల్లో 1,941 సీట్లు అదనంగా వచ్చాయి. వచ్చే విద్యా సంవత్సరంలో 20 శాతం సీట్లను పెంచాలనే నిర్ణయంతో జూన్‌లో ప్రారంభమయ్యే ప్రవేశాల కౌన్సెలింగ్‌లో మరో 2,676 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో నాలుగేళ్లలో బాలికల కోసం అదనంగా పెంచిన సీట్ల సంఖ్య 4,600 దాటనుంది.

ఐఐటీలవారీగా మొత్తం సీట్ల వివరాలు..

ఐఐటీ

2018

2019

2020 (పెరిగే అంచనా)

భువనేశ్వర్

360

419

83

భిలాయ్

120

143

28

బాంబే

960

1,115

224

ఢిల్లీ

851

1,061

213

ధన్‌బాద్ (మైనింగ్)

912

952

191

ధార్వాడ్

120

137

27

గాంధీనగర్

211

212

42

గోవా

90

150

30

గౌహతి

645

785

157

హైదరాబాద్

285

317

64

ఇండోర్

260

294

59

జమ్మూ

150

213

43

జోధ్‌పూర్

240

352

71

కాన్పూర్

831

1,016

203

ఖరగ్‌పూర్

1,342

1,585

317

మద్రాసు

846

967

194

మండి

182

282

56

పాలక్కడ్

160

181

36

పట్నా

225

361

72

రూర్కీ

975

1,136

227

రోపర్

280

346

69

తిరుపతి

180

202

40

వారణాసి

1,071

1,149

230

మొత్తం

11,296

13,376

2,676

Published date : 13 Mar 2020 02:50PM

Photo Stories