అటానమస్ డిగ్రీ కాలేజీల్లో అర్ధరాత్రి బదిలీలు!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల్లో అర్ధరాత్రి బదిలీలు జరిగిపోయాయి. శనివారం రాత్రికి రాత్రి దాదాపు 150 మంది డిగ్రీ లెక్చరర్లను బదిలీ చేసిన కళాశాల విద్యా శాఖ, ఇంకా కొంతమంది లెక్చరర్ల బదిలీకి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
అయితే, ఇప్పటికే రెగ్యులర్ లెక్చరర్లు లేక సాధారణ డిగ్రీ కాలేజీలు ఓవైపు మూత పడుతుంటే వాటిని బలోపేతం చేయాల్సింది పోయి ఉన్న వాటిని మరింతగా దెబ్బతీసే ప్రక్రియకు కళాశాల విద్యాశాఖ శ్రీకారం చుట్టడంపై లెక్చరర్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రెగ్యులర్ లెక్చరర్లు 1,300..
రాష్ట్రంలో 123 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉండగా, వాటిల్లో మంజూరైన లెక్చరర్ పోస్టులు దాదాపు 4,100 ఉన్నాయి. అయితే అందులో ప్రస్తుతం 1,300 మంది మాత్రమే రెగ్యులర్ లెక్చరర్లు పని చేస్తున్నారు. ఇక మొత్తం కాలేజీల్లో 8 అటానమస్ కళాశాలలు ఉన్నాయి. ప్రస్తుతం అటానమస్‌గా ఉన్న బేగంపేట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ, హైదరాబాద్ సిటీ కాలేజీ, నల్లగొండలోని ఎన్‌జీ కాలేజీ, ఖమ్మంలోని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ కాలేజీ, మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కాలేజీ, నిజమాబాద్‌లోని గిరిరాజ్ కాలేజీ, సంగారెడ్డిలోని తారా డిగ్రీ కాలేజీ, సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోనే 450 మంది వరకు రెగ్యులర్ లెక్చరర్లు పని చేస్తుండగా, మిగతా కాలేజీల్లో 850 మంది వరకు లెక్చరర్లు పని చేస్తున్నారు. ప్రస్తుతం వీరిలో దాదాపు 150 మందిని అటానమస్ కాలేజీలకు బదిలీ చేస్తూ కళాశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
నిషేధ సమయంలో..
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం ఉంది. ఈ సమయంలో ఎలాంటి బదిలీలు చేపట్టడానికి వీల్లేదు. ప్రభుత్వం నిషేధం ఎత్తివేస్తేనే లెక్చరర్ల బదిలీలు కూడా చేపట్టవచ్చు. కానీ ఇదేమీ పట్టించుకోకుండా 2001 నాటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల అటానమస్ హోదాకు సంబంధించిన జీవోను (42) అడ్డుపెట్టుకొని అటానమస్ కాలేజీలకు ఇతర కాలేజీల నుంచి బదిలీ చేసే ప్రక్రియకు కళాశాల విద్యా శాఖ శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ అటానమస్ కాలేజీ అయినా రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై నిషేధంతొలగించాకే బదిలీలు చేయాలి తప్ప నిషేధ సమయంలో చేయడానికి వీల్లేదని లెక్చరర్లు చెబుతున్నారు. కానీ అధికారులు మాత్రం జీవో 42 ప్రకారమే తాము బదిలీలు చేపట్టినట్లు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల నుంచి లెక్చరర్లను అటానమస్ డిగ్రీ కాలేజీల్లోకి బదిలీ చేస్తుండటం వల్ల (అటానమస్ నుంచి ఇతర కాలేజీల్లోకి చేయడం లేదు.. పోనీ మిగతా అన్ని కాలేజీల్లో బదిలీలు చేపట్టలేదు) ఆయా కాలేజీల్లో లెక్చరర్లు లేక విద్యా బోధన మరింతగా దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు.
ఒత్తిళ్లతోనే బదిలీలు..
తెలంగాణ ఏర్పడిన ఈ ఆరేళ్లలో జీవో 42 ప్రకారం రెగ్యులర్ డిగ్రీ కాలేజీల నుంచి అటానమస్ డిగ్రీ కాలేజీల్లోకి బదిలీలు చేయలేదని, ఇప్పుడే మొదటి సారి బదిలీలు చేస్తున్నారని లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు రకాల ఒత్తిళ్లతోనే బదిలీలు చేపట్టారని ఆరోపి స్తున్నారు. 24 శాతం హెచ్‌ఆర్‌ఏ కలిగిన హైదరాబాద్‌లోని కాలేజీల్లోకి ఎక్కువ మంది లెక్చరర్లను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. బదిలీల్లో పారదర్శకత లేదని, నిర్దేశిత అర్హతలతోపాటు అకడమిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ (ఏపీఐ) స్కోర్ ఎక్కువ కలిగినవారికి ప్రాధా న్యం ఇవ్వలేదని లెక్చరర్లు ఆరోపిస్తున్నారు.

Published date : 21 Dec 2020 03:50PM