Skip to main content

ఆర్జీయూకేటీ సెట్- 2020 డిసెంబర్ 5కు వాయిదా

సాక్షి, అమరావతి/నూజివీడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్నందున శనివారం జరగాల్సిన ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) సెట్-2020ని డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేసినట్టు సెట్ కన్వీనర్ డి.హరినారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ట్రిపుల్ ఐటీలలోని 4 వేల సీట్లను భర్తీ చేయడంతో పాటు వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాలలోని పలు డిప్లొమా కోర్సులకు సంబంధించిన 6 వేల సీట్ల భర్తీకి ఈ సెట్‌ను శనివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే నివర్ తుపాను ప్రభావం నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో తీవ్రంగా ఉన్నందున అభ్యర్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ ఈ మార్పును గమనించాలని, పరీక్ష కేంద్రాలు, అభ్యర్థులకు కేటాయించిన హాల్‌టికెట్లలో ఎలాంటి మార్పు లేదన్నారు.
Published date : 28 Nov 2020 12:48PM

Photo Stories