Skip to main content

అన్‌అకాడెమీకి ‘టైగర్’ నిధులు

న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ, అన్‌అకాడెమీ భారీగా నిధులు సమీకరించింది.
టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, డ్రాగనీర్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్‌ల నుంచి ఈ పెట్టుబడులను సమీకరిం చామని అన్‌అకాడెమీ సీఈఓ గౌరవ్ ముంజాల్ పేర్కొన్నారు. టైగర్ గ్లోబల్, డ్రాగనీర్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తమ ప్రయాణంలో భాగస్వాములు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే పెట్టుబడులు విలువ వెల్లడించలేదు. తాజా ఇన్వెస్ట్‌మెంట్స్ పరంగా చూస్తే, అన్‌అకాడెమీ విలువ 200 కోట్ల డాలర్లు(రూ.14,785 కోట్లు) మేర ఉంటుందని అంచనా. కాగా ఈ సంస్థ ఈ ఏడాది సెప్టెంబర్‌లో సాఫ్ట్‌బ్యాంక్ విజన ఫండ్ 2 నుంచి రూ.1,125 కోట్ల నిధులు సమీకరించింది. అన్‌అకాడెమీ గ్రూప్‌లో అన్‌అకాడెమీ, ప్రెప్‌ల్యాడర్, మాస్ట్రీ, కోడ్‌చెఫ్, గ్రాఫీ తదితర సంస్థలున్నాయి. ఈ సంస్థలన్నీ 5,000 నగరాల్లో 47,000 మంది బోధకుల ద్వారా 14 భారతీయ భాషల్లో ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహిస్తోంది.
Published date : 26 Nov 2020 02:20PM

Photo Stories