ఆగస్టు 31లోగా జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ పూర్తి
Sakshi Education
సాక్షి, అమరావతి, నెట్వర్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు జగనన్న విద్యాకానుక ద్వారా స్టూడెంట్స్ కిట్ల పంపిణీ చురుగ్గా సాగుతోంది.
విద్యార్థులంతా ఉత్సాహంగా నాడు–నేడు ద్వారా తీర్చిదిద్దిన పాఠశాలలకు తరలివస్తూ కిట్లను అందుకుని మురిసిపోతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు 16వ తేదీన తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం జడ్పీ పాఠశాలలో జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 47,32,064 మంది విద్యార్థులకు ఈ కిట్లను అందించనున్నారు. ఇప్పటికే అన్ని మండల కేంద్రాలకు అక్కడినుంచి జిల్లా కేంద్రాలకు కిట్లలోని వస్తువులను ప్రభుత్వం సరఫరా చేసింది. వీటిని బ్యాగుల్లో సర్ది ప్రతి బ్యాగుపై విద్యార్థి పేరు, కిట్‌లో ఉన్న వస్తువులను సూచిస్తూ స్టిక్కర్‌పై వివరాలు పొందుపరిచి విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులంతా ఒకేసారి గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దశలవారీగా కిట్ల పంపిణీకి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఆగస్టు 31వ తేదీవరకు కిట్లను పంపిణీ చేయాలని సూచించారు.
జిల్లాలవారీగా పంపిణీ ఇలా..
విశాఖ జిల్లాలో 3,63,114 కిట్లు అవసరం కాగా ఇప్పటివరకూ 70,084 పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలు తెరిచేనాటికి విద్యార్థులందరికీ జగనన్న విద్యాకానుక కిట్లు అందజేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. జిల్లాలో 4,68,455 మంది విద్యార్థులుండగా వీరందరికీ కిట్లలోని వస్తువులన్నీ అందాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 3,31,887 మందికి కిట్లు ఇవ్వాల్సి ఉండగా గురువారం వరకు 1,13,112 కిట్లను పంపిణీ చేశారు. కర్నూలు జిల్లాలో 4,71,024 మంది విద్యార్థులకు గానూ ఇప్పటి వరకు 37,933 మందికి కిట్లు అందాయి. శ్రీకాకుళం జిల్లాలో 2,86,450 లక్షల మంది విద్యార్థులు ఉండగా 1,56,810 మందికి ఇప్పటికే అందచేశారు. విజయనగరం జిల్లాలో 2,26,157 మంది విద్యార్థులు చదువుతుండగా 1,19,100 మందికి ఇప్పటిదాకా కిట్లు అందించారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగా 3,71,315 మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను అందజేయాల్సి ఉండగా ఇప్పటివరకు 66 వేల కిట్లను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. శ్రీపొట్టి శ్రీరాములు జిల్లాలో 2,71,498 మంది విద్యార్థులు ఉండగా గురువారం మధ్యాహ్నం సమయానికి 12,917 మందికి కిట్లు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లాలో 4,208 మంది విద్యార్థులకు రిజిస్టర్లలో పేర్లు నమోదు చేసుకుని కిట్లు పంపిణీ చేశారు. బయోమెట్రిక్ అధెంటిఫికేషన్ వ్యవస్థ సక్రమంగా పని చేయకపోవడంతో పంపిణీ ఆగింది. మండలాల వారీగా డివైజ్‌లను సరి చేసి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో కిట్లు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో 3.51 లక్షల మంది విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా బయోమెట్రిక్ యంత్రాల సమస్య, విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండటం వల్ల జాప్యం జరుగుతోంది. ఈనెల 18వ తేదీ నాటికి మొత్తం 5 వేల కిట్లు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లాలో ఇప్పటిదాకా 1,22,913 మందికి జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేశారు. మొత్తం 4,06, 678 మందికి కిట్లు ఇవ్వాలి.కృష్ణా జిల్లాలో 3,17,443 మంది విద్యార్థులకుగానూ ఇప్పటిదాకా 1.30 లక్షల మందికి పంపిణీ చేశారు. వైఎస్సార్ జిల్లాలో 3,373 స్కూళ్లలో 2,68,143 మంది విదార్థులు చదువుతుండగా ఇప్పటివరకు మాన్యువల్‌గా 97,312 మందికి, బయోమెట్రిక్ విధానంలో 2,688 మందికి విద్యాకానుకలను అందచేశారు.
స్టూడెంట్ కిట్లలో ఉండే వస్తువులు
(నోట్‌బుక్కులు 2,43,57,966, వర్కుబుక్కులు 1,64,40,723, పాఠ్యపుస్తకాలు 3,81,31,454 పంపిణీ చేయనున్నారు.)
భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే శివరామకృష్ణది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి. ఇద్దరు పిల్లల్ని చదివించేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చేది. పుస్తకాలు, దుస్తులు, బూట్లు కొనడం తలకుమించిన భారంగానే ఉండేది. ఇప్పుడు అమ్మ ఒడితోపాటు జగనన్న విద్యాకానుక ద్వారా ప్రభుత్వం ఆసరాగా నిలవడంతో ఊపిరి పీల్చుకుంటున్నాడు. విద్యాకానుక ద్వారా కొత్త దుస్తులతో పాటు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బూట్లు, స్కూల్ బ్యాగులు, ఆఖరికి టై, బెల్టు లాంటివన్నీ ప్రభుత్వమే సమకూరుస్తుండటంతో పిల్లలను దొరబాబుల్లా బడికి పంపుతున్నట్లు ఆయన భార్య శాయన ఉష సంతోషంగా చెప్పింది.
– తల్లి శాయన ఉషతో 7వ తరగతి విద్యార్థి హర్షవర్థన్, మాదేపల్లి జెడ్పీ హైస్కూల్
ఈ ఫోటోలో ఉన్న కర్నూలు జిల్లా వెల్దుర్తి ఇందిరాగాంధీనగర్‌కు చెందిన రాజుకు ముగ్గురు కుమార్తెలు. కూలి పనులకు వెళ్తుంటాడు. ఏటా పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయంటే ఆందోళన మొదలయ్యేది. బ్యాగులు, నోట్ పుస్తకాలు తదితరాల రూ.8 వేల దాకా ఖర్చు అయ్యేది. జగనన్న విద్యా కానుక వల్ల గతేడాది నుంచి ఆ ఖర్చులు మిగులుతున్నాయి.
– రాజు, వెల్దుర్తి పెయింటర్, ఇందిరాగాంధీనగర్

వస్తువులు | తరగతి | లబ్ధిదారులు |
నోట్ పుస్తకాలు | 6–10 | 23,59,504 |
బెల్టులు | 1–5 బాలికలు | 35,29,015 |
షూలు | 1–10 | 47,32,064 |
స్కూల్ బ్యాగులు | 1–10 | 47,32,064 |
యూనిఫారం క్లాత్ | 1–10 | 47,32,064 |
డిక్షనరీ | 1–5 | 23,72,560 |
డిక్షనరీ | 6–10 | 23,59,504 |
వర్కుబుక్కులు | 1–5 | 23,72,560 |
పాఠ్యపుస్తకాలు | 1–10 | 47,32,064 |
(నోట్‌బుక్కులు 2,43,57,966, వర్కుబుక్కులు 1,64,40,723, పాఠ్యపుస్తకాలు 3,81,31,454 పంపిణీ చేయనున్నారు.)
భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే శివరామకృష్ణది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి. ఇద్దరు పిల్లల్ని చదివించేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చేది. పుస్తకాలు, దుస్తులు, బూట్లు కొనడం తలకుమించిన భారంగానే ఉండేది. ఇప్పుడు అమ్మ ఒడితోపాటు జగనన్న విద్యాకానుక ద్వారా ప్రభుత్వం ఆసరాగా నిలవడంతో ఊపిరి పీల్చుకుంటున్నాడు. విద్యాకానుక ద్వారా కొత్త దుస్తులతో పాటు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బూట్లు, స్కూల్ బ్యాగులు, ఆఖరికి టై, బెల్టు లాంటివన్నీ ప్రభుత్వమే సమకూరుస్తుండటంతో పిల్లలను దొరబాబుల్లా బడికి పంపుతున్నట్లు ఆయన భార్య శాయన ఉష సంతోషంగా చెప్పింది.
– తల్లి శాయన ఉషతో 7వ తరగతి విద్యార్థి హర్షవర్థన్, మాదేపల్లి జెడ్పీ హైస్కూల్
ఈ ఫోటోలో ఉన్న కర్నూలు జిల్లా వెల్దుర్తి ఇందిరాగాంధీనగర్‌కు చెందిన రాజుకు ముగ్గురు కుమార్తెలు. కూలి పనులకు వెళ్తుంటాడు. ఏటా పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయంటే ఆందోళన మొదలయ్యేది. బ్యాగులు, నోట్ పుస్తకాలు తదితరాల రూ.8 వేల దాకా ఖర్చు అయ్యేది. జగనన్న విద్యా కానుక వల్ల గతేడాది నుంచి ఆ ఖర్చులు మిగులుతున్నాయి.
– రాజు, వెల్దుర్తి పెయింటర్, ఇందిరాగాంధీనగర్
Published date : 20 Aug 2021 07:01PM