Skip to main content

అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు కార్య దర్శి వి.రామకృష్ణ గురువారం హెచ్చరించారు.
కరోనా వల్ల ప్రజల ఆర్థిక స్థితిగతులు ఛిన్నాభిన్నమైన పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు గత విద్యాసంవత్సరంలో నిర్ణయించిన ఫీజులో 30 శాతం కుదింపు చేస్తూ ప్రభుత్వం జీవో 57ను విడుదల చేసిందని గుర్తు చేశారు. ఆ మేరకు ఫీజును తగ్గించి తక్కిన ఫీజును మాత్రమే 2020-21 విద్యాసంవత్సరానికి వసూలు చేయాలని, విద్యార్థుల నుంచి ఒకేసారి కాకుండావిడతల వారీగా వసూలు చేయాలని ప్రభుత్వంజీవోలో పేర్కొందని తెలిపారు. పలు జూనియర్ కాలేజీలు ఈ ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. కాలేజీలు తమ కాలేజీ నోటీసు బోర్డులో కేటగిరీ వారీగా ఫీజుల సమాచారాన్ని అందరికీ తెలిసేలా ప్రదర్శించాలని ఆదేశించారు.
Published date : 22 Jan 2021 03:00PM

Photo Stories