900 మంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ నియామకం
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నియామకాల ప్రక్రియ కొనసాగిస్తోంది.
ఆరోగ్య రంగంలో గత ఏడాదిన్నరలో ఏ రాష్ట్రం చేపట్టనన్ని నియామకాలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగిన సంగతి తెలిసిందే. ఇదే కోవలో తాజాగా 900 మంది ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్)ను కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా సర్కార్ నియమించింది. దీంతో కొద్దినెలల క్రితం నియమితులైన 2,100 మందితో కలిపి వీరి సంఖ్య 3 వేలకు చేరింది. బీఎస్సీ నర్సింగ్ చేసిన వీరు.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌లో పనిచేస్తారు. ఇప్పటివరకు సబ్ సెంటర్‌లుగా పిలిచే ఇక్కడ ఏఎన్‌ఎం మాత్రమే ఉండేది. ఇకపై బీఎస్సీ నర్సింగ్ చేసినవారు ఉంటారు. మరికొద్ది రోజుల్లో మరిన్ని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ పోస్టులు భర్తీ చేయనున్నట్టు కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు.
Published date : 10 Apr 2021 05:18PM