Skip to main content

4 నుంచి డిగ్రీ రెండో విడత కౌన్సెలింగ్.. మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన సమానావకాశం..

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా డిగ్రీ కోర్సుల్లో సీట్ల భర్తీకి అమల్లోకి తెచ్చిన ఆన్‌లైన్ విధానం విద్యార్థులకు ఉపయుక్తంగా మారింది.
తొలివిడత కౌన్సెలింగ్ పూర్తికావడంతో ఉన్నత విద్యామండలి ఈనెల 4వ తేదీనుంచి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఆన్‌లైన్ విధానంతో విద్యార్థులకు మెరిట్ ఉంటే తాము కోరుకున్న కాలేజీలో, కోర్సులో సీటు పొందే అవకాశం దక్కింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే రిజర్వుడ్ వర్గాలకు గతంలో ప్రముఖ ప్రైవేటు కాలేజీల్లో చదివేందుకు అవకాశం దక్కేది కాదు. ఇప్పుడు రిజర్వేషన్ల ప్రకారం సీట్లు భర్తీ చేస్తుండటంతో ఆయా వర్గాల వారికి సీట్లు దక్కుతున్నాయి. విద్యార్థులు గతంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కాలేజీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంట్లో కూర్చునో, లేదంటే దగ్గర్లోని ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి ఆన్‌లైన్లో తమకు నచ్చిన కాలేజీల్లో, నచ్చిన కోర్సుల్లో సీటు కోసం ఆప్షన్ ఇచ్చి సీట్లు పొందుతున్నారు.

విద్యార్థులకు అందుబాటులో కాలేజీల సమాచారం..
రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల పరిధిలో ప్రభుత్వ, ప్రయివేటు ఎయిడెడ్, ప్రయివేట్ అన్ ఎయిడెడ్.. మొత్తం 1,301 కాలేజీల్లో వివిధ కోర్సులకు సంబంధించి 4,95,956 సీట్లున్నాయి. కాలేజీలో ఉన్న కోర్సులు, సదుపాయాలు, ల్యాబ్‌లు, లెక్చరర్లు, న్యాక్ గుర్తింపు వంటి అన్ని వివరాలను ఉన్నత విద్యామండలి.. వెబ్ కౌన్సెలింగ్ కోసం ఏర్పాటుచేసిన https://oamdc.ap.gov.in వెబ్‌సైట్‌లో జిల్లాల వారీగా ఉంచింది. ఈ వివరాలు పరిశీలించిన విద్యార్థులు తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చారు. గతనెల 6వ తేదీనుంచి 21వ తేదీవరకు తొలివిడత కౌన్సెలింగ్‌ను నిర్వహించి 24వ తేదీన 1,95,645 సీట్లను కేటాయించారు. విద్యార్థుల ఫోన్లకు ఏ కాలేజీలో ఏ కోర్సులో సీటు వచ్చిందో సమాచారం పంపించారు. తొలివిడత కౌన్సెలింగ్‌లో చిత్తూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. మొదటి విడతలో సీట్లు రానివారికోసం, తాము అనుకున్న కాలేజీలో, కోర్సులో సీట్లు పొందలేని వారికోసం రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనుంది.

జిల్లాల వారీగా కాలేజీల్లో ఉన్న సీట్లు.. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ అయిన సీట్లు

జిల్లా

ప్రభుత్వ కాలేజీలు

ఎయిడెడ్ కాలేజీలు

ప్రైవేటు కాలేజీలు

 

మొత్తం సీట్లు

భర్తీ అయినవి

మొత్తం సీట్లు

భర్తీ అయినవి

మొత్తం సీట్లు

భర్తీ అయినవి

అనంతపురం

8,841

4,001

2,574

1,384

28,208

12,215

చిత్తూరు

8,013

3,453

5,325

2,755

40,560

16,336

తూ.గోదావరి

8,564

5,035

7,565

3,605

37,943

11,794

గుంటూరు

2,998

1,370

11,977

4,435

22,500

8,782

వైఎస్సార్ కడప

5,747

1,927

4,863

1,870

18,876

7,352

కృష్ణా

3,929

1,642

10,264

4,554

20,053

7,735

కర్నూలు

5,961

2,380

7,906

3,331

30,981

12,127

నెల్లూరు

2,883

901

3,468

755

20,681

8,722

ప్రకాశం

2,190

846

2,740

707

23,530

9,783

శ్రీకాకుళం

5,005

2,647

132

72

30,657

11,113

విశాఖపట్నం

4,663

2,661

4,719

2,454

34,655

12,173

విజయనగరం

1,606

867

2,617

1,329

27,643

9,765

ప.గోదావరి

5,234

2,046

8,970

3,966

20,915

6,755

మొత్తం

65,634

29,776

73,120

31,217

3,57,202

1,34,652

Published date : 01 Feb 2021 05:02PM

Photo Stories