Skip to main content

2020ఏప్రిల్ 1వ తేదీ నుంచిమధ్యాహ్న భోజనం ధరలు పెంపు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం ధరలను ప్రభుత్వం 3.09 శాతం పెంచింది.
ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై (కోడి గుడ్డు పైసలు కాకుండా) ప్రస్తుతం వంట ఏజెన్సీలకు ఇస్తున్న 4 రూపాయల 35 పైసలను 4 రూపాయల 48 పైసలకు పెంచింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై (కోడి గుడ్డు పైసలు కాకుండా) చెల్లించే 6 రూపాయల 51 పైసలను 6 రూపాయల 71 పైసలకు పెంచింది. ఇందులో 60 శాతం డబ్బులను కేంద్రం ఇస్తుండగా, రాష్ట్రం 40 శాతం నిధులను కేటాయించనుంది. 9, 10 తరగతుల విద్యార్థులను పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ పెంపును ఆయా విద్యార్థులపై కూడా వర్తింపజేయనుంది. అలాగే ఆయా విద్యార్థులకు రోజుకు ఒక కోడిగుడ్డు పెట్టేందుకు ఈ మొత్తానికి అదనంగా 2 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది. ఈ పెంపు 2020, ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
Published date : 29 Jan 2020 04:49PM

Photo Stories