2020- 21 విద్యాసంవత్సరానికి డిగ్రీ, పీజీ అకడమిక్ క్యాలెండర్ ఇదే..
నవంబర్ 2 నుంచి సరి, బేసి సంఖ్యల రోజుల్లో తరగతులు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లో కూడా వీటిని కొనసాగించేలా మార్గదర్శకాలిచ్చారు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ ఫస్టియర్ తరగతులను డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించనున్నారు.
ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన క్యాలెండర్
- వారంలో ఆరు రోజులు పనిదినాలుంటాయి. ఏదైనా కారణాల వల్ల పని దినాన్ని కోల్పోవాల్సి వస్తే రెండో శనివారం, ఇతర సెలవు దినాల్లో (నేషనల్ హాలిడేలు, ముఖ్యమైన పండుగ దినాలు మినహా) భర్తీ చేయాలి.
- ఫస్టియర్ పీజీ ప్రోగ్రాంల షెడ్యూల్‌ను వేరుగా విడుదల చేస్తారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి కాలేజీలను నిర్వహించాల్సి ఉంటుంది.
ఏయే తరగతులు ఎప్పటి నుంచంటే..
అన్ని యాజమాన్య పాఠశాలలు, కాలేజీల్లోని 9, 10, 12 తరగతుల విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. నవంబర్ 23 నుంచి అన్ని పాఠశాలల్లో 6 నుంచి 8 తరగతులు మొదలవుతాయి. డిసెంబర్ 14 నుంచి అన్ని పాఠశాలల్లో 1 నుంచి 5 క్లాసులు, నవంబర్ 16 నుంచి ఇంటర్మీడియెట్ ఫస్టియర్ తరగతులు మొదలవుతాయి. నవంబర్ నెలంతా బడులు ఒంటిపూట (ఉదయం 9 నుంచి 1.30 వరకు) మాత్రమే ఉంటాయి. మధ్యాహ్న భోజనం ముగిశాక పిల్లలను ఇళ్లకు పంపిస్తారు. తరగతి గదిలో విద్యార్థుల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు ఉండాలి. ఒక్కో తరగతి గదిలో 16 మందికి మించకుండా ఉండాలి. రోజు విడిచి రోజు తరగతులకు హాజరయ్యేలా ఏర్పాట్లు. విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న స్కూళ్లలో తరగతుల నిర్వహణపై హెడ్మాస్టర్లు షెడ్యూల్ రూపొందిస్తారు. డిగ్రీ, పీజీ ప్రొఫెషనల్, నాన్ ప్రాఫెషనల్ కోర్సులకు సంబంధించి ఫస్టియర్ మినహా తక్కిన తరగతులు నవంబర్ 2 నుంచి దశల వారీగా ప్రారంభమవుతాయి. ఆ కాలేజీల్లో ఫస్టియర్ తరగతులు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం.
కొత్త అకడమిక్ క్యాలెండర్ ఇదే..
నాన్ ప్రొఫెషనల్ కోర్సులు
కాలేజీల రీ ఓపెన్ తేదీ: | నవంబర్ 2 |
3, 5 సెమిస్టర్ల తరగతులు: | నవంబర్ 2 |
ఇంటర్నల్ పరీక్షలు: | డిసెంబర్ 1 నుంచి 5 |
చివరి పరీక్షలు: | 2021 మార్చి 8 |
4, 6 సెమిస్టర్ల తరగతులు: | 2021 మార్చి 25 |
ఇంటర్నల్ పరీక్షలు: | జూన్ 1 నుంచి 5 |
చివరి పరీక్షలు: | ఆగస్టు 9 |
ప్రొఫెషనల్ కోర్సులు (బీటెక్, బీఫార్మ్)
3, 5, 7 సెమిస్టర్ల తరగతుల ప్రారంభం: | నవంబర్ 2 |
ఇంటర్నల్ పరీక్షలు: | డిసెంబర్ 1 నుంచి 5 |
చివరి సెమిస్టర్ పరీక్షలు: | 2021 మార్చి 8 |
4, 6, 8 సెమిస్టర్ల తరగతులు: | 2021 మార్చి 25 |
ఇంటర్నల్ పరీక్షలు: | జూన్ 1 నుంచి 5 |
చివరి సెమిస్టర్ పరీక్షలు: | 2021 ఆగస్టు 9 |
పీజీ ప్రోగ్రాంలు
కాలేజీల ప్రారంభం, 3 సెమిస్టర్ తరగతులు: | నవంబర్ 2 |
ఇంటర్నల్ పరీక్షలు: | డిసెంబర్ 1 నుంచి 5 |
చివరి సెమిస్టర్ పరీక్షలు: | 2021 మార్చి 8 |
4 సెమిస్టర్ తరగతులు: | 2021 మార్చి 25 |
ఇంటర్నల్ పరీక్షలు: | 2021 జూన్ 1 నుంచి 5 |
చివరి సెమిస్టర్ పరీక్షలు: | 2021 ఆగస్టు 9 |