Skip to main content

2019 మే తర్వాతనే విద్యా రంగంలో విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాల అమలు..!

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యా రంగంలో అసలు ప్రగతి 2019 మే తర్వాతేనా..? అంతకుముందు పాఠశాల విద్య దారుణంగా పతనమైందా అంటే పరోక్షంగా అవుననే అంటున్నాయి..
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించిన తాజా గణాంకాలు. పాఠశాల విద్యకు సంబంధించి 2019–20 పెర్‌ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండికేటర్ల (పీజీఐ)లో మన రాష్ట్రం ఏకంగా 13 అంశాల్లో వెనుకంజలో నిలిచింది. ఈ గ్రేడ్లను 2018–19 పెర్‌ఫార్మెన్స్‌ గణాంకాల ఆధారంగా ప్రకటించారు. వివిధ అంశాలకు సంబంధించి రాష్ట్రానికి 2017–18లో మొత్తం 1000 పాయింట్లకు 728 పాయింట్లు రాగా 2018–19లో ఈ స్కోర్‌ 725 పాయింట్లకు పడిపోవడం గమనార్హం. దీనికి కారణం అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేయడమేనని విద్యావేత్తలు చెబుతున్నారు. వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక కార్యక్రమాలు, పథకాలకు శ్రీకారం చుట్టి కొత్తపుంతలు తొక్కించారు. విద్యా రంగాన్ని సమూలంగా సంస్కరించడంతో పురోగతి పరుగులు పెట్టింది. వాటి ఆధారంగా పెర్‌ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండికేటర్లను ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

విద్యా రంగంలో కనీవినీ ఎరుగని కార్యక్రమాలు..
  • సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే అనేక విప్లవాత్మక పథకాలను, కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
  • అమ్మఒడి కింద రెండేళ్ల నుంచి 44.48 లక్షల మంది తల్లులకు రూ.13,022.93 కోట్లు అందించారు.
  • జగనన్న విద్యాకానుక కింద గతేడాది 42.34 లక్షల మంది విద్యార్థులకు రూ.648 కోట్లతో మూడు జతల యూనిఫామ్, బెల్టు, షూ, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్, బ్యాగు అందించారు. ఈ ఏడాది మరో ఐదు లక్షల మందికి అదనంగా అంటే.. 47.32 లక్షల మందికి ఆ వస్తువులతోపాటు అదనంగా ఇంగ్లిష్‌– తెలుగు డిక్షనరీని కూడా అందిస్తున్నారు.
  • అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా ఈ ఏడాది నుంచి ప్రీ ప్రైమరీ విధానానికి శ్రీకారం చుట్టారు.
  • పాఠశాల విద్యలో ప్రమాణాల పెంపు, ఫీజుల నియంత్రణకు ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
  • విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని గతంలో మాదిరిగా కాకుండా రోజుకోరకమైన మెనూతో చిక్కీలు, కోడిగుడ్లు వంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు.
  • ‘మనబడి: నాడు–నేడు’ కింద రాష్ట్రంలో 45 వేలకు పైగా ఉన్న స్కూళ్లన్నిటిలో 9 రకాల మౌలిక సదుపాయాలను కల్పించి వాటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
  • మరుగుదొడ్ల నిర్వహణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయించి ఆయాలను నియమించారు.
  • టీచర్లకు ఆంగ్ల మాధ్యమ బోధనలో కేంబ్రిడ్జి వంటి వర్సిటీల సహకారంతో శిక్షణ ఇప్పించడంతోపాటు విద్యార్థులకూ ఆంగ్లంపై శిక్షణ ఇప్పించారు. ఇలా విద్యాభివృద్ధికి చేపడుతున్న ఎన్నో కార్యక్రమాల ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

13 అంశాల్లో వెనుకబాటు..
  • రాష్ట్ర విద్యా రంగంలో 19 అంశాల్లో స్వల్ప పెరుగుదల, 38 అంశాల్లో యథాతథం, 13 అంశాల్లో వెనుకబాటు ఉన్నట్లు పీజీఐ గణాంకాలు స్పష్టం చేశాయి.
  • మరుగుదొడ్ల ఏర్పాటు.. వాటి నిర్వహణలోనూ విఫలమైంది. అంతకుముందు ఈ అంశంలో 8 పాయింట్ల స్కోర్‌లో నిలువగా ఈసారి 7కు పడిపోయింది.
  • కంప్యూటర్‌ ఎయిడెడ్‌ లెర్నింగ్‌ (సీఏఎల్‌)లో 0 స్కోర్, బుక్‌ బ్యాంక్, రీడింగ్‌ రూములు, లైబ్రరీల ఏర్పాటులో అంతకు ముందు 20 స్కోర్‌ పాయింట్లు రాగా ఈసారి 14కు తగ్గింది.
  • మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడంలోనూ విఫలమైంది. సర్వశిక్ష అభియాన్‌కు సమర్పించిన లక్ష్యాలను చేరుకోలేకపోయింది.
  • హెడ్మాస్టర్లకు స్కూల్‌ లీడర్‌íషిప్‌ ట్రైనింగ్‌లో గతంలో స్కోర్‌ 20 ఉండగా ఈసారి సున్నా మాత్రమే.
  • టీచర్లకు ఆధునిక బోధన పద్ధతులపై శిక్షణలో గతంలో 20 పాయింట్లు రాగా ఈసారి 5 మాత్రమే వచ్చాయి.
  • టీచర్ల బదిలీల్లో పారదర్శకత విషయంలో స్కోర్‌ పాయింట్లు 20 నుంచి 10కి తగ్గాయి.
  • విద్యార్థుల హాజరును డిజిటల్‌గా గుర్తింపచేయడంలో కేవలం 1 పాయింట్‌ మాత్రమే సాధించింది.

కరోనాతో స్కూళ్లు మూతపడి పిల్లలు ఇళ్లకే పరిమితమైన సమయంలోనూ విద్యా కార్యక్రమాలు ఆగకుండా ఆన్‌లైన్, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తరగతులు కొనసాగించింది. ఆయా కార్యక్రమాలు ఇలా..
  • విద్యామృతం: పదో తరగతి విద్యార్థులకు దూరదర్శన్‌ ద్వారా టీవీ పాఠాలతో బోధన
  • విద్యా కలశం: పదో తరగతి విద్యార్థులకు ఆల్‌ ఇండియా రేడియో ద్వారా రేడియో పాఠాలు
  • విద్యా వారధి: ఇతర తరగతుల నుంచి తదుపరి తరగతుల్లోకి ప్రమోటయ్యే విద్యార్థుల్లో లోపాలను సరిదిద్ది.. తదుపరి తరగతి పాఠ్యాంశాలను అర్థం చేసుకునేలా వారిని తీర్చిదిద్దడానికి బ్రిడ్జి కోర్సులు
  • ఉపాధ్యాయ శిక్షణ: వెబినార్ల ద్వారా ఇంగ్లిష్‌ ప్రావీణ్యంపై శిక్షణ
  • స్టూడెంట్‌ హెల్ప్‌లైన్‌: విద్యార్థి సందేహాలను తొలగించే కాల్‌సెంటర్‌
  • వాట్సాప్‌ గ్రూపులు: వాట్సాప్‌ గ్రూపుల ద్వారా మోడల్‌ ప్రశ్నపత్రాలు పంపి, వాటికి సమాధానాలు రాయిస్తూ విద్యార్థులకు బోధన, శిక్షణ ఉపాధ్యాయుల కోసం ఆన్‌లైన్‌ టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ రూపకల్పన పోటీలు.. 8 –10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ డ్రాయింగ్‌ పోటీలు ఉపాధ్యాయుల కోసం కవర్‌ పేజీ పోటీలు
  • అభ్యాస యాప్‌: ఉపాధ్యాయులు, విద్యార్థుల స్వయం అభ్యసనం కోసం అభ్యాస యాప్‌.
  • నిష్టా: ‘నేషనల్‌ ఇనిíÙయేటివ్‌ ఫర్‌ స్కూల్‌ హెడ్స్‌ టీచర్స్‌ హోలిస్టిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ (నిష్టా) యాప్‌ ద్వారా ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ట్రైనింగ్‌. ఇది పాఠశాల విద్యలో నాణ్యత పెంపొందించే కార్యక్రమం.

కేంద్ర విద్యా శాఖ రాష్ట్రానికి ప్రకటించిన స్కోర్‌ పాయింట్లు ఇలా..

కేటగిరీ

మొత్తం

2017–18

2018–19

అభ్యసన ఫలితాలు, నాణ్యతæ

180

154

154

అందుబాటు

80

70

77

మౌలిక సదుపాయాలు

150

99

104

సమానావకాశాలు

230

194

194

ప్రభుత్వ నిర్వహణ తీరు

360

211

196

మొత్తం

1,000

728

725


చ‌ద‌వండి: రెండేళ్లలోనే ఏపీలో విద్య, వైద్య విప్లవం

చ‌ద‌వండి: జూన్‌16 నుంచి ఇంటర్మీడియట్‌ ఆన్‌లైన్‌ తరగతులు!
Published date : 14 Jun 2021 07:36PM

Photo Stories