Skip to main content

20 వేల మంది అమెజాన్ ఉద్యోగులకు కరోనా...

శాన్ ఫ్రాన్సిస్కో: కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు తమ సంస్థలో పనిచేసే దాదాపు 20 వేల మంది ఉద్యోగులు కరోనా బారిన పడినట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది.
1.37 మిలియన్‌ల ఫ్రంట్‌లైన్ కార్మికుల డేటాతో పాటు యునైటెడ్ స్టేట్స్‌లోని హోల్ ఫుడ్స్ మార్కెట్, కిరాణా దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులతో కలిపి కరోనా పాజిటివ్‌ల రేటు ఊహించిన దానికంటే తక్కువ రేటును చూపించిందని అమెజాన్ తన ప్రకటనలో పేర్కొంది. దాదాపు 650 సైట్ల ద్వారా అమెజాన్‌ రోజుకు 50,000 పరీక్షలను నిర్వహించిందని సీటెల్ ఆధారిత సంస్థ తెలిపింది.

మహమ్మారి పట్ల ఉద్యోగులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి అమెజాన్‌ చాలా కష్టపడిందని చెప్పింది. కరోనా సంక్షోభం ప్రారంభం నుంచి ప్రతి బ్రాంచ్‌లో‌ పనిచేసే ఉద్యోగులకు వారి భవనంలో నమోదైన ప్రతి కొత్త కేసు గురించిన సమాచారం ప్రతి ఫ్రంట్‌ లైన్‌ ఉద్యోగులకు బ్లాగ్‌ ద్వారా పంచుకునేదని తెలిపింది. హోల్‌ ఫుడ్స్‌ విభాగంలో పనిచేసే ఉద్యోగుల రేటు అమెరికా జనాభాకు సమానంగా ఉంటే, ఇందులో పాజిటివ్‌ కేసుల సంఖ్య 33 వేలుగా ఉండే అవకాశముందని వివరించింది. కోవిడ్‌ బారిన పడకుండా ఉద్యోగులను సంరక్షించేందుకు తమ సంస్థ తీసుకున్న భద్రత చర్యలపై లాజిస్టిక్స్‌ కేంద్రాల్లో పనిచేసే కొంత మంది ఉద్యోగులు విమర్శించడమే కాకుండా, కరోనా సోకిన తమ సహ ఉద్యోగుల గురించిన సమాచారాన్ని పంచుకోవటానికి కూడా ఇష్టపడలేదని అమెజాన్‌ పేర్కొంది.
Published date : 02 Oct 2020 02:22PM

Photo Stories