ఈ ఏడాది తెలంగాణకు 5,040 ఎంబీబీఎస్ సీట్లు..!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. తాజాగా ఓ ప్రైవేట్ కాలేజీకి అనుమతి రావడంతో అదనంగా 150 ఎంబీబీఎస్ సీట్లు పెరిగినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది.
రాష్ట్రంలో 2020-21 సంవత్సరానికి మెదక్ జిల్లా పటాన్‌చెరులో టీఆర్‌ఆర్ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తాజాగా అనుమతించింది. దీంతో మరో 150 సీట్లు ఈ ఏడాది నుంచి అదనంగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 5,040కు చేరుకున్నాయి. ఈఎస్‌ఐసీ సహా మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,740 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. 18 ప్రైవేట్ కాలేజీల్లో 2,750 సీట్లు, 4 మైనారిటీ మెడికల్ కాలేజీల్లో 550 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నట్లు కాళోజీ వర్సిటీ తెలిపింది.
ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్
అఖిల భారత కోటా అడ్మిషన్ల నోటిఫికేషన్ ఈ నెల చివరి వారంలో వచ్చే అవకాశాలున్నట్లు కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. కరోనా కారణంగా ఈ ఏడాది నీట్ నిర్వహణలో జాప్యం జరిగింది. దీంతో రాష్ట్ర స్థాయి అడ్మిషన్లను త్వరితగతిన నిర్వహించాలని విశ్వవిద్యాలయం భావిస్తోంది. ఈ నెల 16న నీట్ ఫలితాలు వచ్చినా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇంకా రాష్ట్రానికి ర్యాంకుల సమాచారం పంపలేదు. ఈ నెల చివరి వారంలో రాష్ట్ర ర్యాంకుల సమాచారం అందుతుందని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పటిలా విడిగా కాకుండా రాష్ట్ర స్థాయి ర్యాంకుల జాబితాతో పాటు దరఖాస్తుల స్వీకరణ నోటిషికేషన్ ఒకేసారి విడుదల చేస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లోని 15 శాతం సీట్లను ఆలిండియా కోటాకు ఇస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు మినహాయించి, రాష్ట్రం నుంచి సుమారు 230 సీట్లు ఆలిండియా కోటాలోకి ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో అన్ని రాష్ట్రాల నుంచి 6,410 ఎంబీబీఎస్ సీట్లు అఖిల భారత కోటాలోకి చేరాయి. వీటి కోసం దేశవ్యాప్తంగా అర్హత కలిగిన విద్యార్థులు పోటీ పడతారు. అయితే ఈసారి రాష్ట్ర విద్యార్థులు సుదూర రాష్ట్రాల్లో అఖిల భారత స్థాయి కోటాలో సీట్లు వచ్చినా చేరకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Published date : 20 Oct 2020 06:09PM