గిరిజన విద్యార్థులకు నీట్-2021 ఉచిత శిక్షణ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: గిరిజన విద్యార్థులకు నీట్-2021 ప్రవేశ పరీక్షకు ఉచితంగా లాంగ్‌టర్మ్ శిక్షణ ఇస్తున్నట్లు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) వెల్లడించింది.
నీట్-2020లో 30 కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు మాత్రమే ఈ శిక్షణకు అర్హులని తెలిపింది. రాజేంద్రనగర్‌లోని ఐఐటీ స్టడీ సెంటర్‌లో ఇచ్చే లాంగ్‌టర్మ్ కోచింగ్ పట్ల ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 6వ తేదీలోగా గిరిజన గురుకుల సొసైటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ దరఖాస్తు మరియు ఇతర వివరాల కొరకు http://www.tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్‌ని సందర్శించాలని గిరిజన గురుకుల సొసైటీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
Published date : 03 Nov 2020 04:31PM