ఐఎఫ్‌ఎస్ మెయిన్-2019 షెడ్యూల్ విడుదల..ప్రిపరేషన్ ఇలా..
Sakshi Education
యూపీఎస్సీ.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) మెయిన్-2019 పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఐఏఎస్, ఐపీఎస్‌ల తర్వాత ఆ స్థాయి హోదా, గౌరవం ఐఎఫ్‌ఎస్ ద్వారా లభిస్తాయి. దీంతో ఐఎఫ్‌ఎస్‌కు పోటీ పడే అభ్యర్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో... ప్రిలిమ్స్‌లో విజయం సాధించి మెయిన్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయో గపడేలా ఐఎఫ్‌ఎస్ మెయిన్ పరీక్ష ప్యాట్రన్, ప్రిపరేషన్ టిప్స్...
మెయిన్ ఎగ్జామినేషన్ రెండు సెషన్లుగా ఉంటుంది. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు; రెండో సెషన్ మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.
పరీక్ష విధానం :
ప్రిపరేషన్ ఇలా..
ఐఎఫ్‌ఎస్ మెయిన్‌లో అభ్యర్థి అకడెమిక్ సామర్థ్యాలు, విషయావగాహన, విజ్ఞానాలను పరీక్షిస్తారు.
ఇంగ్లిష్ :
అభ్యర్థుల్లో చాలామంది ఇంగ్లిష్ పేపర్‌ను తేలిగ్గా తీసుకుంటుంటారు. ఇది సరికాదు. ఇంగ్లిష్‌లో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ప్రిపరేషన్ పరంగా రిపోర్ట్ రైటింగ్, ప్రెసిస్ రైటింగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. మోస్తరుగా ప్రిపేరయినా ఈ పేపర్‌లో సులభంగా 200 మార్కులు పొందేందుకుఅవకాశం ఉంది.
జనరల్ నాలెడ్జ్ :
జనరల్ నాలెడ్జ్ పేపర్‌పై అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలి. ఈ పేపర్‌లో చరిత్ర, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర కోర్ సబ్జెక్టులతోపాటు సమకాలీన అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లోని చర్చనీయాంశాలపై దృష్టిసారించాలి. ఆయా అంశాలను విశ్లేషించగలిగే నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. అదేవిధంగా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీల్లోని ప్రాథమిక అంశాలపై పట్టుసాధించాలి. కరెంట్ ఈ వెంట్స్, దైనందిన అంశాలు, వాటి శాస్త్రీయతను పరీక్షించడం ద్వారా విజయావకాశాలు మెరుగవుతాయి.
స్పష్టత :
సాధారణంగా మెయిన్ ఆప్షనల్స్ సబ్జెక్టుల్లో ఒకటి అభ్యర్థి అకడెమిక్ బ్యాగ్రౌండ్‌కు సంబంధించింది, మరొకటి కొత్తదిగా ఉంటుంది. అభ్యర్థులు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్తగా ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించి అధిక సమయం వెచ్చించాలి. సదరు సబ్జెక్టు ప్రాథమిక భావనలు, సిద్ధాంతాలు, ముఖ్యాంశాలపై పట్టుసాధించాలి.
ప్రాక్టీస్ :
సమయ నిర్వహణ :
ప్రిపరేషన్ పరంగా అన్ని సబ్జెక్టులకు సమయం కేటాయించాలి. ఆ దిశగా పక్కా ప్రణాళిక రూపొందించుకొని.. దాన్ని తుచా తప్పకుండా అమలుచేయాలి. ప్రిపరేషన్ పరంగా రోజుకి పది గంటలకు తగ్గకుండా చదవాలి. దీంతోపాటు ప్రతి సబ్జెక్టుకు నిర్దిష్ట సమయం కేటాయించాలి. సబ్జెక్టు, అంశాల క్లిష్టత, బలాలు, బలహీనతలను బేరీజు వేసుకొని టైం టేబుల్‌ను రూపొందించుకోవాలి. ప్రిపరేషన్‌పై స్వీయ విశ్లేషణతో ఎప్పటికప్పుడు టైం టేబుల్‌లో మార్పులు చేసుకోవాలి.
పర్సనాలిటీ టెస్ట్ / ఇంటర్వ్యూ :
కెరీర్ :
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్‌కి జిల్లా స్థాయిలో తన విభాగానికి సంబంధించి పాలన, న్యాయ, ఆర్థిక పరమైన అంశాల్లో దాదాపు స్వయంప్రతిపత్తి అధికారాలు ఉంటాయి. అటవీ శాఖలోని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్(డీఎఫ్‌వో), కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీఎఫ్), ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) పోస్టులను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ద్వారా ఎంపికైన అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
ఐఎఫ్‌ఎస్ మెయిన్-2019 షెడ్యూల్ ఇలా:
పరీక్ష విధానం :
- పేపర్ 1- జనరల్ ఇంగ్లిష్: 300 మార్కులు
- పేపర్ 2- జనరల్ నాలెడ్జ్: 300 మార్కులు
- పేపర్ 3/4/5/6: ఇవి ఆప్షనల్ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్లు. ప్రతి సబ్జెక్టు నుంచి రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌ను 200 మార్కులకు నిర్వహిస్తారు. అన్ని పేపర్లు రాత పరీక్ష (వ్యాసరూప) విధానంలోనే ఉంటాయి.
ప్రిపరేషన్ ఇలా..
ఐఎఫ్‌ఎస్ మెయిన్‌లో అభ్యర్థి అకడెమిక్ సామర్థ్యాలు, విషయావగాహన, విజ్ఞానాలను పరీక్షిస్తారు.
ఇంగ్లిష్ :
అభ్యర్థుల్లో చాలామంది ఇంగ్లిష్ పేపర్‌ను తేలిగ్గా తీసుకుంటుంటారు. ఇది సరికాదు. ఇంగ్లిష్‌లో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ప్రిపరేషన్ పరంగా రిపోర్ట్ రైటింగ్, ప్రెసిస్ రైటింగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. మోస్తరుగా ప్రిపేరయినా ఈ పేపర్‌లో సులభంగా 200 మార్కులు పొందేందుకుఅవకాశం ఉంది.
- అభ్యర్థులు ఇంగ్లిష్‌లో వ్యాసాలు రాయడం ప్రాక్టీస్ చేయాలి.
- ఈ పేపర్ నుంచి అడిగే ఇతర ప్రశ్నలు వాస్తవ పరిస్థితుల్లో ఉపయోగించే పదాలపై అభ్యర్థులకున్న అవగాహనను పరీక్షించేవిగా ఉంటాయి.
- పాసేజ్ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు.
జనరల్ నాలెడ్జ్ :
జనరల్ నాలెడ్జ్ పేపర్‌పై అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలి. ఈ పేపర్‌లో చరిత్ర, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర కోర్ సబ్జెక్టులతోపాటు సమకాలీన అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లోని చర్చనీయాంశాలపై దృష్టిసారించాలి. ఆయా అంశాలను విశ్లేషించగలిగే నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. అదేవిధంగా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీల్లోని ప్రాథమిక అంశాలపై పట్టుసాధించాలి. కరెంట్ ఈ వెంట్స్, దైనందిన అంశాలు, వాటి శాస్త్రీయతను పరీక్షించడం ద్వారా విజయావకాశాలు మెరుగవుతాయి.
స్పష్టత :
సాధారణంగా మెయిన్ ఆప్షనల్స్ సబ్జెక్టుల్లో ఒకటి అభ్యర్థి అకడెమిక్ బ్యాగ్రౌండ్‌కు సంబంధించింది, మరొకటి కొత్తదిగా ఉంటుంది. అభ్యర్థులు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్తగా ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించి అధిక సమయం వెచ్చించాలి. సదరు సబ్జెక్టు ప్రాథమిక భావనలు, సిద్ధాంతాలు, ముఖ్యాంశాలపై పట్టుసాధించాలి.
ప్రాక్టీస్ :
- గత ప్రశ్నపత్రాల సాధన ప్రిపరేషన్‌లో కీలకంగా నిలుస్తుంది. తద్వారా ప్రశ్నల సరళి, స్వీయసామర్థ్యం, ప్రిపరేషన్ తీరుపై అవగాహన లభిస్తుంది. కాబట్టి గత ఐదారేళ్ల పేపర్లను ప్రాక్టీస్ చేయాలి.
- ప్రిపరేషన్ పరంగా అనువర్తనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సబ్జెక్టుపై పట్టుసాధించడం ఎంత ముఖ్యమో... ఆయా అంశాలను వాస్తవ పరిస్థితులకు అన్వయించడం అంతే ప్రధానం.
- ప్రిపరేషన్‌లో ప్రశ్నలు, సమాధానాలను విశ్లేషిస్తూ ముందుకెళ్లాలి. తద్వారా వివిధ అంశాలు, వాటి ప్రిపరేషన్ పరంగా స్వీయ సామర్థ్యంపై అవగాహన ఏర్పడుతుంది.
సమయ నిర్వహణ :
ప్రిపరేషన్ పరంగా అన్ని సబ్జెక్టులకు సమయం కేటాయించాలి. ఆ దిశగా పక్కా ప్రణాళిక రూపొందించుకొని.. దాన్ని తుచా తప్పకుండా అమలుచేయాలి. ప్రిపరేషన్ పరంగా రోజుకి పది గంటలకు తగ్గకుండా చదవాలి. దీంతోపాటు ప్రతి సబ్జెక్టుకు నిర్దిష్ట సమయం కేటాయించాలి. సబ్జెక్టు, అంశాల క్లిష్టత, బలాలు, బలహీనతలను బేరీజు వేసుకొని టైం టేబుల్‌ను రూపొందించుకోవాలి. ప్రిపరేషన్‌పై స్వీయ విశ్లేషణతో ఎప్పటికప్పుడు టైం టేబుల్‌లో మార్పులు చేసుకోవాలి.
పర్సనాలిటీ టెస్ట్ / ఇంటర్వ్యూ :
- ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ 300 మార్కులకు జరుగుతుంది. ఇంటర్వ్యూలో అభ్యర్థి సర్వీస్‌కి సరితూగుతాడా లేదా అనే విషయాన్ని పరీక్షిస్తారు. ఇందులో భాగంగా సబ్జెక్టుకు సంబంధించిన అంశాలతోపాటు రాజకీయ, సాంస్కృతిక, సామాజిక అంశాల్లో అభ్యర్థుల అవగాహనను అంచనా వేస్తారు. సమకాలీనాంశాలు, తాజాగా వెలుగులోకి వచ్చిన కొత్త ఆలోచనలు, సొంత రాష్ట్రం, దేశంలో వచ్చిన నూతన ఆవిష్కరణల గురించి తెలుసుకోవడం ద్వారా ఇంటర్వ్యూలో మెరుగైన ప్రదర్శన ఇవ్వొచ్చు.
- ఇంటర్వ్యూలో ముఖ్యంగా అభ్యర్థిలోని విజ్ఞాన తృష్ణ, క్రిటికల్ థింకింగ్, నిర్ణయాలు తీసుకోవడంలో ఉన్న స్థితప్రజ్ఞత, మానసిక, శారీరక సామర్థ్యాలను వాస్తవ పరిస్థితులకు ఎలా అన్వయించగలరు, భౌగోళిక అవగాహన, ఔట్‌డోర్ వాతారణం, పరిస్థితులపై ఉండే ఉత్సుకత తదితర అంశాలను పరీక్షిస్తారు.
కెరీర్ :
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్‌కి జిల్లా స్థాయిలో తన విభాగానికి సంబంధించి పాలన, న్యాయ, ఆర్థిక పరమైన అంశాల్లో దాదాపు స్వయంప్రతిపత్తి అధికారాలు ఉంటాయి. అటవీ శాఖలోని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్(డీఎఫ్‌వో), కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీఎఫ్), ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) పోస్టులను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ద్వారా ఎంపికైన అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
ఐఎఫ్‌ఎస్ మెయిన్-2019 షెడ్యూల్ ఇలా:
తేదీ | ఉదయం | మధ్యాహ్నం |
డిసెంబర్ 1 | జనరల్ ఇంగ్లిష్ | జనరల్‌నాలెడ్జ్ |
డిసెంబర్ 3 | మ్యాథ్స్/స్టాటిస్టిక్స్ పేపర్ 1 | మ్యాథ్స్/స్టాటిస్టిక్స్ పేపర్ 2 |
డిసెంబర్ 4 | ఫిజిక్స్/జువాలజీ పేపర్ 1 | ఫిజిక్స్/జువాలజీ పేపర్ 2 |
డిసెంబర్ 5 | కెమిస్ట్రీ/జియాలజీ పేపర్ 1 | కెమిస్ట్రీ/జియాలజీ పేపర్ 2 |
డిసెంబర్ 6 | అగ్రికల్చర్ పేపర్/ యానిమల్ హజ్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్ పేపర్ 1 | అగ్రికల్చర్ పేపర్/ యానిమల్ హజ్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్ పేపర్ 2 |
డిసెంబర్ 7 | ఫారెస్ట్రీ పేపర్ 1 | ఫారెస్ట్రీ పేపర్ 2 |
డిసెంబర్ 8 | అగ్రికల్చరల్/సివిల్/ కెమికల్/మెకానికల్ ఇంజనీరింగ్ పేపర్ 1/ బోటనీ పేపర్ 1 | అగ్రికల్చరల్/సివిల్/ కెమికల్/మెకానికల్ ఇంజనీరింగ్ పేపర్ 2/ బోటనీ పేపర్ 2 |
Published date : 28 Oct 2019 01:57PM