Skip to main content

LAWCET 2022: లాసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

లాసెట్‌ కౌన్సెలింగ్‌ నవంబర్‌ 2 నుంచి జరుగుతుందని తెలంగాణ ఉన్నతవిద్య మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు.
LAWCET 2022
లాసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

దీని ఏర్పాట్లపై కౌన్సిల్‌ కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాసరావు, లాసెట్‌ కన్వీనర్‌ పి.రమేష్‌బాబుతో అక్టోబర్‌ 31న చర్చించారు. అనంతరం కౌన్సెలింగ్‌కు సంబంధించిన కాలపట్టికను విడుదల చేశారు. ఐదేళ్ల, రెండేళ్ల పీజీ లాసెట్‌ కౌన్సెలింగ్‌ ఒకేసారి ఉంటుందని తెలిపారు.

చదవండి: ‘లా’ .. యువత ఆకర్షణీయ కెరీర్

లాసెట్‌ కాలపట్టిక 

విషయం

తేదీ

నోటిఫికేషన్‌ విడుదల

1–11–2022

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన

2 నుంచి 12 వరకు

ఎన్‌సీసీ, ప్రత్యేక కేటగిరీల ధృవపత్రాల పరిశీలన

14 నుంచి 16

తప్పొప్పుల సవరణ

17–11–2022

వెబ్‌ ఆప్షన్లు

18 నుంచి 22 వరకు

సీట్ల కేటాయింపు

22–11–2022

కాలేజీలో రిపోర్టింగ్‌

23 నుంచి 26 వరకు

క్లాసుల ప్రారంభం

28–11–2022

Published date : 01 Nov 2022 12:41PM

Photo Stories