Skip to main content

AP Lawcet: ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుద‌ల‌..ఫ‌లితాల డైరెక్ట్ లింక్ ఇదే

సాక్షి ఎడ్యుకేష‌న్‌: న్యాయ కళాశాలల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ లాసెట్‌–2021 ఫలితాలను అక్టోబర్‌ 21 మధ్యాహ్నం 2.45 గంటలకు విడుదల చేశారు.
AP Lawcet Results
AP Lawcet Results

ఈ ఫ‌లితాల‌ను తిరుపతిలోని సావేరి అతిథి భ‌వ‌నంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి విడుద‌ల చేశారు.న్యాయ కళాశాలల్లో మూడు, ఐదేళ్ల న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. మూడేళ్ల లా కోర్సులో 92.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఐదేళ్ల లా కోర్సులో 1,991 మంది ఉత్తీర్ణులయ్యారని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తెలిపారు. అలాగే మూడేళ్ల లా కోర్సులో విజయవాడకు చెందిన మోపురు హరిప్రియ మొదటి ర్యాంకు సాధించారు. గుంటూరుకు చెందిన లీలా రాజా సెకండ్‌ ర్యాంక్‌.. కందలగడ్డ హరికృష్ణ మూడో ర్యాంకు సాధించారు. చీరాలకు చెందిన గొర్ల హారిబాబు,  అనంతపురానికి చెందిన సాతర్ల మంజునాధ 4, 5 ర్యాంకులు సాధించారు.

ఐదేళ్ల లా కోర్సుల్లో టాప్ ర్యాంక‌ర్లు వీరే..

☛మొదటి ర్యాంక్- మోనికా భాయి, బనగానపల్లె, కర్నూల్ జిల్లా.

☛సెకండ్ ర్యాంక్- వెలిచేటి నాగ సాయి ప్రశాంతి,  బంటుపల్లి, రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా

☛మూడో ర్యాంక్- ఇనపకుర్తి శ్రీనివాస సునీల్, బూడి వీధి పూసపాటి రేగడ, విజయనగరం జిల్లా,

☛నాలుగవ ర్యాంక్-నర్మద భారతి, మాకవరపాలెం, విశాఖపట్నం.

☛అయిదో ర్యాంక్‌- బొప్పరాజు వెంకట బ్రహ్మం, తర్ల పాడు, ప్రకాశం జిల్లా

 

పీజీ లాసెట్‌లో..

☛మొదటి ర్యాంక్‌- యారబాల గీతిక, శివాజిపాలెం, విశాఖపట్నం

☛సెకండ్ ర్యాంక్.- కాగడాల కృష్ణం నాయుడు, శ్రీకాకుళంజిల్లా..

☛ మూడో ర్యాంక్, రరమేష్ బాబు తాత పూడి,  విజయవాడ

☛ నాలుగో ర్యాంక్‌- మన్నం సుసన్యా, విజయవాడ

☛ అయిదో ర్యాంక్‌-  సనతనా భారత్, శాంతి నగర్, నెల్లూరు

ఏపీ లాసెట్‌-2021 ఫ‌లితాల కోసం క్లిక్‌  చేయండి

 

చదవండి: 

Times Higher Education: టెమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ

NIT: నిట్‌లో పెరిగిన సీట్లు

Published date : 21 Apr 2023 03:27PM

Photo Stories