Skip to main content

Albenzole Tablet: పిల్లలకు మాత్రలు తప్పనిసరి

ఆదిలాబాద్‌రూరల్‌: పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి ఆల్బెండజోల్‌ మాత్రలు తప్పనిసరి అని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ పేర్కొన్నారు.
Albenzole Tablet
పిల్లలకు మాత్రలు తప్పనిసరి

ఆగ‌స్టు 3న‌ జిల్లా కేంద్రంలోని కొలాం ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమానికి ఆయన హాజరై విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

చదవండి: Child Protection: ‘బాలల కోసం ఒక రోజు’పై సమీక్ష

జిల్లాలో 1–19 ఏళ్ల పిల్లలు 1,92,725 మంది ఉన్నారని, వీరికి ప్రభుత్వ ఆస్పత్రులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మాత్రలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్ర మంలో జిల్లా వైద్యాధికారి నరేందర్‌ రాథోడ్‌, జిల్లా సంక్షేమాధికారి మిల్కా, జిల్లా అదనపు వైద్యాధికారి సాధన, ఆదిలాబాద్‌ రూరల్‌ మండల వైద్యాధికారి రాహుల్‌, ఏటీడీవో నిహారిక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Published date : 04 Aug 2023 01:40PM

Photo Stories