‘ఉపాధి’ ఉద్యోగులకు వైద్య పరీక్షలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న నిర్దిష్ట కాలపరిమితి సిబ్బందికి (ఎఫ్‌టీఈ) ప్రభుత్వం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది.
జనవరి 29 (బుధవారం)నప్రారంభమైన ఈ శిబిరాలు మార్చి 13 వరకు కొనసాగుతాయని పం చాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. ఉచిత వైద్య బీమా సౌకర్యం అందజేస్తున్న ఏజెన్సీ పర్యవేక్షణలో జరిగే ఈ శిబిరాల్లో ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేట ర్, ఏపీవో, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించనుంది. ఎఫ్‌టీఈ సిబ్బందికే కాకుండా వారి కుటుంబీకులకు కూడా పరీక్షలు జరుపుతారని, ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని గ్రా మీణ సేవల కల్పన, అభివృద్ధి సంస్థ సీఈఓ ఓ ప్రకటనలో కోరారు.
Published date : 30 Jan 2020 05:00PM