కొత్తగా భర్తీ చేయనున్న ఉద్యోగాల జీతభత్యాలసైతం..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం 2021-22కి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన కసరత్తును తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రారం భించింది.
గెజిటెడ్, నాన్ గెజిటెడ్‌తో సహా శాశ్వత, తాత్కాలిక, సూపర్ న్యూమరరీ పోస్టుల వివరాలు, ఈ పోస్టులకు వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి చెల్లించాల్సిన జీతాలు, ప్రత్యేక భత్యాలు, ఫిక్స్‌డ్ అలవెన్సులు తదితర వివరాలను నిర్దేశిత నమూనాలో సమర్పించాలని అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాల అధిపతులను ఆదేశించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖాళీ పోస్టులు, కొత్తగా సృష్టించిన పోస్టుల్లో భర్తీ చేసే కొత్త ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతభత్యాలు, ఇతర చెల్లింపుల అంచనాలను సైతం సమర్పించాలని కోరింది.
Published date : 25 Dec 2020 03:37PM