జూలైలో జాబ్స్ పెరిగాయ్..: నౌకరి జాజ్ ఇండెక్స్
Sakshi Education
ముంబై: కరోనా ప్రేరేపిత లాక్డౌన్ సడలింపుతో జూలైలో ఉద్యోగ నియమాకాలు పెరిగాయి.
కేంద్రం అన్లాక్ ప్రక్రియను ప్రారంభించడంతో అనేక కీలక పరిశ్రమలు పునఃప్రారంభమయ్యాయి. ఫలితంగా కిందటి నెల జూన్లో పోలిస్తే ఈ జూలైలో ఉద్యోగ నియామకాలు పెరిగాయి. అయితే వార్షిక ప్రాతిపదికన పోలిస్తే నియామకాలు భారీగా తగ్గాయి. ఆసక్తికరంగా మైట్రో నగరాల్లో కంటే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నియామకాలు పెరగడం విశేషం. మీడియా–ఎంటర్టైన్మెంట్, నిర్మాణ, ఇంజనీరింగ్ రంగాల్లో అధికంగానూ.., బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీస్, ఇన్సూరెన్స్, అటో, టెలికం రంగాల్లో మోస్తారు నియమకాలు జరిగాయి.
ఐటీ రంగంలో మాత్రం నియామకాలు అంతంగా మాత్రంగా ఉన్నాయి. నౌకరి జాజ్ ఇండెక్స్ ప్రకారం ఈ జూలైలో మొత్తం 1263 జాబ్ పోస్టింగ్లు నమోదయ్యాయి. కిందటి నెల జూన్లో జరిగిన 1208 పోస్టింగ్లతో పోలిస్తే 5శాతం వృది జరిగింది. అయితే గతేడాది ఇదే జూలైతో నియామకాలు 47శాతం క్షీణించాయి. కిందటి నెలతో పోలిస్తే ఈ జూలైలో నియాయకాలు స్వల్పంగా పెరిగాయి. అయితే వార్షిక ప్రాతిపదికన 47శాతం క్షీణించాయి. రానున్నరోజుల్లో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు ఆంక్షలను మరింత పరిమితం చేయవచ్చు. ఈ ఆగస్ట్లో ఉద్యోగాలు మరింత పెరిగే అవకాశం ఉంది అని నౌక్రీ డాట్కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ చెప్పారు.

Published date : 13 Aug 2020 05:54PM