జనవరి 31 నుంచి పలు టీఎస్‌పీఎస్సీపోస్టుల ధ్రువపత్రాల పరిశీలన
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి సంబంధించి అర్హత ఉన్న బీకాం అభ్యర్థులకు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 4 వరకు నాంపల్లిలోని తమ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-2, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ గ్రేడ్-2, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టులకు వెరిఫికేషన్ జరపనున్నట్లు కమిషన్ పేర్కొంది. వివరాలకు www. tspsc.gov.in ను సంప్రదించాలని జనవరి 28 (మంగళవారం)నఓ ప్రకటనలో సూచించింది.
Published date : 29 Jan 2020 04:51PM