Skip to main content

ఈ కంపెనీతో 2 వేల మందికి ఉద్యోగాలు : సీఎం జ‌గ‌న్‌

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : ఆంధ్రపదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పులివెందుల ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఏర్పాటు చేయనున్న అపాచీ లెదర్‌ ఇండస్ట్రీకి డిసెంబర్‌ 24వ తేదీన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..తైవాన్‌ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించాం. అడిడాస్‌ బ్రాండెడ్‌ షూస్‌ తయారీలో అపాచీ కీలకం. మనదేశంతో పాటు వియాత్నం, చైనాలోనూ అపాచీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 2006లో వైఎస్సార్‌ హయాంలో తడలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. తడ ఫ్యాక్టరీ ద్వారా ప్రతిఏటా కోటి 80 లక్షల ప్రొడక్షన్‌ జరుగుతోంది. 11 వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. తాజాగా పులివెందులలో తమ కంపెనీని విస్తరిస్తున్నారు. ఈ కంపెనీ ద్వారా 2వేల మందికి ఉపాధి లభిస్తుంది. 50 శాతం మహిళలకు ఉపాధి అవకాశాలు ఉంటాయి. శ్రీకాళహస్తిలో కూడా భూమిని కేటాయించాం. అక్కడ కూడా రూ.350 కోట్లతో పరిశ్రమను నెలకొల్పుతున్నారు. శ్రీకాళహస్తి పరిశ్రమ ద్వారా 5వేల మందికి ఉపాధి లభిస్తుంది. ప్రపంచ బ్యాంకుతో కలిసి కేంద్రం రిలీజ్‌ చేసిన ర్యాంకుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్నారు.
Published date : 24 Dec 2020 07:20PM

Photo Stories