PGT and JL Posts Recruitment: పీజీటీ,జేఎల్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : జిల్లాలో పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు,కళాశాలల్లో ఖాళీగా ఉన్న పీజీటీ,జూనియర్ లెక్చరర్ పోస్టులను అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో ఈ విద్యాసంవత్సరానికి మాత్రమే భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఐటీడీఏ పీవో వి.అభిషేక్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
జూనియర్ లెక్చరర్లకు సంబంధించి ఇంగ్లిషు– 2, గణితం–2, జువాలజీ– 1, హిస్టరీ– 1, కామర్స్(ఒకేషనల్)– 1,జీఎఫ్‌సీ(ఎకనామిక్స్)–1, పీజీటీలో గణితం–1 పోస్టుల భర్తీకి గాను అర్హులైన ఇంగ్లిషు మీడియం చదివిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈనెల 28వ తేదీ సాయంత్రం 5గంటల లోపు పాడేరు ఐటీడీఏలోని గురుకులం సెల్‌లో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. దరఖాస్తులను ఈనెల 29, 30 తేదీల్లో పరిశీలించి, ఈనెల 31వతేదీ, ఆగస్టు 1న పాడేరు గురుకుల కళాశాలలో ఎంపిక నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులంతా ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని తెలిపారు. విద్యార్హత, ఇతర వివరాల కోసం 9491030243, 9492929375 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించాలని పీవో సూచించారు.
Published date : 25 Jul 2023 01:29PM