Skip to main content

New Degree Courses : మారుతి నుంచి కొత్తగా డిగ్రీ కోర్సు..టాటా సహకారంతో పాటు ఉద్యోగాలు కూడా..

కార్ల అమ్మకాల్లో దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉన్న మారుతి సుజూకి మరో అడుగు ముందుకు వేసింది.

భవిష్యత్తులో తమ సంస్థకు అవసరమైన మానవ వనరులను అభివృద్ధి చేసే పనిపై ఫోకస్‌ పెట్టింది.

ఆటోమోటివ్‌ రిటైల్‌ :
మార్కెట్‌ రీసెర్చ్‌ అంచనాల ప్రకారం దేశంలో ప్రతీ వెయ్యి మందికి కేవలం 36 కార్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి కోవిడ్‌ సంక్షోభం పూర్తిగా ముగిసి ఆర్థిక పరిస్థితి గాడిన పడితే కార్ల అమ్మకాలు ఊపందుకుంటాయని మార్కెట్‌ అనాలిసిస్టులు చెబుతున్నారు. దీంతో ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకి అవసరమైన రీతిలో హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌పై మారుతి దృష్టి సారించింది. అందులో భాగంగా రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ విత్‌ స్పెషలైజేషన్‌ ఇన్‌ ఆటోమోటివ్‌ రిటైల్‌ కోర్సును ప్రవేశ పెడుతోంది.

మూడేళ్ల కోర్సు..
ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకి సంబంధించి మూడేళ్ల డిగ్రీ కోర్సును అందివ్వాలని మారుతి నిర్ణయించింది. ఈ కోర్సులో పూర్తిగా  ఆటోమైబైల్‌ పరిశ్రమకు సంబంధించిన అంశాలనే సిలబస్‌లో పొందు పరచనుంది. మొదటి ఏడాది కేవలం తరగతి కోర్సుగా మిగిలిన రెండేళ్లు మారుతి ఆథరైజ్డ్‌ డీలర్‌షిప్‌ యూనిట్లలో ప్రాక్టికల్‌ తరగతులు నిర్వహిస్తారు.  యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా ఈ కోర్సుని డిజైన్‌ చేసింది. 

టాటా సహకారంతో.. 
మారుతి సంస్థ అందిస్తోన్న మూడేళ్ల కొత్త కోర్సును మొదటగా టాటా ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ - స్కూల్‌ ఆఫ్‌ వొకేషనల్‌ ఎడ్యుకేషన్‌ (టీఐఎస్‌ఎస్‌-ఎస్‌వీఈ) ముంబై క్యాంపస్‌లో ప్రవేశపెడుతున్నారు. ఈ కోర్సుకు సంబంధించిన తొలి బ్యాచ్‌కి 2021 అక్టోబరు నుంచి క్లాసులు ప్రారంభం అవనుంది. కోర్సు పూర్తైన తర్వాత విద్యార్థుల యోగ్యతను బట్టి మారుతి లేదా ఇతర సంస్థలలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

జపాన్‌ తరహా స్కిల్స్‌..
ఆటోమోటివ్‌ ఇండస్ట్రీలో రిటైల్‌ సెక్టార్‌లో స్కిల్డ్‌ వర్కర్లు లభించడం లేదని, అందుకే ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా యువతకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని రుతి సుజూకి ఇండియా, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, మనోజ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ కోర్సులో జపాన్‌ తరహా వర్క్‌ కల్చర్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ని మన యూత్‌లో డెవలప్‌ చేయడం మా లక్ష్యమని ఆయన వివరించారు.

Published date : 29 Sep 2021 07:10PM

Photo Stories