Free Training: ఆంగ్లంలో పట్టుపై ఉపాధ్యాయులకు శిక్షణ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులు ఆంగ్లంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలని విల్‌టూ కెన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ సంస్థ డైరెక్టర్ రామేశ్వర్‌గౌడ్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు విల్‌టూ కెన్ సంస్థ, ఎస్సీఆర్టీఈ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన ఇంగ్లిష్ విద్యను అందించే లక్ష్యంతో సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు ఇంగ్లిష్ బోధనలో ఇంగ్లీష్ ధనలో మరిన్ని మెళకువలు నేర్చుకుని, సులువైన పద్ధతుల్లో, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. ఇందుకోసం ప్రత్యక్షంగా ఒక రోజు, 45 రోజులు ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని తెలిపారు.
Training for Teachers: ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరం
నేటి నుంచి కేజీబీవీ సీఆర్టీ పోస్టులకు పరీక్షలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న సీఆర్టీ, పీజీసీఆర్టీ, స్పెషల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నేటి నుంచి పరీక్షలు నిర్వహించనుంది. ఉమ్మడి జిల్లా పరీక్షకేంద్రాలుగా జిల్లా కేంద్రంలోని ఫాతిమా విద్యాలయం, జయప్రకాష్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. సోమవారం సోషల్ సబ్జెక్టు, ఈ నెల చివరి వరకు వివిధ సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహించున్నారు. పరీక్షలను విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించనున్నారు. ఫాతిమా విద్యాలయంలో 589, జేపీఎన్‌సీలో 981 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.