Jobs: ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లతో ఉపాధి
మదనపల్లె సిటీ: ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి రవిచంద్రబాబు అన్నారు. స్థానిక సీఎల్ఆర్సి భవనంలో శుక్రవారం మదనపల్లె,తంబళ్లపల్లె, ములకలచెరువుల ఆర్బీకె సిబ్బందికి ప్రధానమంత్రి ఆహారశుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పరిజ్ఞానం ఉన్నవారికి ఆధునికతను జోడించి వ్యాపారాన్ని సమున్నత స్థాయికి తీసుకెళ్లడానికి సంకల్పించినట్లు తెలిపారు. యువత ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పరిశ్రమల స్థాపనకు ముందు రావాలని కోరారు. కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి ఈశ్వరప్రసాద్‌రెడ్డి ,జిల్లా వ్యవసాయ మండలి సభ్యులు బొదుషావల్లి, డీఆర్పిలు మహేష్, గోరవ్థన్ పాల్గొన్నారు.
AP Government Jobs 2023 : ఏపీలో 590 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..