Skip to main content

డిగ్రీ అర్హతతో.. త్వరలో 10,811 పోస్టులకు కాగ్ ఇండియా నోటిఫికేషన్

సాక్షి, ఎడ్యుకేషన్: న్యూఢిల్లీలోని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (సీఏజీ)కి చెందిన జనరల్ సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, మినిస్టీరియల్ విభాగాల్లో దేశవ్యాప్తంగా 10,811 (ఆడిటర్ 6409, అకౌంటెంట్ 4402) పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఈ సందర్భంగా కంపెనీ వాటాదారుల (స్టేక్ హోల్డర్స్) నుంచి ఫిబ్రవరి 19 లోపు అభిప్రాయాలను కోరుతూ ప్రపోస్డ్ రిక్రూట్‌మెంట్ నోటీస్ విడుదల చేసింది. కాగ్‌లో వివిధ విభాగాల్లో రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలను కూడా ఆ నోటీస్‌లో పొందుపరిచింది. కాగా తెలంగాణలో ఆడిటర్ 220, అకౌంటెంట్ 132, ఆంధ్రప్రదేశ్‌లో ఆడిటర్ 144, అకౌంటెంట్ 120 ఉద్యోగావకాశాలు ఉన్నాయి. పూర్తి సమాచారం కోసం కాగ్ అఫీషియల్ వెబ్‌సైట్ https://cag.gov.in/ ను సంప్రదించండి.
Published date : 28 Jan 2021 05:20PM

Photo Stories