Skip to main content

10,000 మంది ఉద్యోగులను తొలగించనున్న ప్రముఖ కంపెనీ ఇదే..

హెల్సింకి: వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ రంగంలో ఉన్న దిగ్గజ సంస్థ నోకియా సంచలన నిర్ణయం తీసుకుంది.
10,000 మంది సిబ్బందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. నాలుగు ప్రధాన వ్యాపార విభాగాల్లో ఈ కోత ఉంటుందని వెల్లడించింది. అయితే ఏ దేశంలోని ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నదీ అన్న విషయాన్ని మాత్రం తెలియజేయకపోవడం గమనార్హం. పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులు చేసేందుకై వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. లక్ష మంది ఉద్యోగులు ఉన్న ఈ సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా రెండేళ్లలో ఈ సంఖ్యను 80–85 వేలకు పరిమితం చేయనుంది.
Published date : 17 Mar 2021 11:45AM

Photo Stories