Skip to main content

JEE Result 2023 Session 2 Direct Link : జేఈఈ మెయిన్స్‌ 2023 సెషన్‌-2 ఫలితాలు విడుదల.. అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫ‌లితాలు విడుద‌ల అయ్య‌యి.
jee result 2023 session 2 results released news telugu
jee result 2023 session 2 results

జాతీయ పరీక్షల సంస్థ (NTA) ఈ ఫ‌లితాల‌ను ఏప్రిల్ 29వ తేదీ (శ‌నివారం) ఉద‌యం విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే ఫైనల్ 'కీ' కూడా విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 15 వరకు JEE Main Session- 2 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫ‌లితాల‌ను టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) అఫీషియల్‌ వెబ్‌సైట్‌లో చూడోచ్చు.రిజల్ట్‌ చెక్‌ చేసుకునేందుకు.. స్కోర్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు..  https://jeemain.nta.nic.in/లో చూడండి.

How to Check JEE Main 2023 session-2 Marks..?
➤☛ Visit the official website ☛ jeemain.nta.nic.in 2023.
➤☛ On the homepage, click on the ‘JEE Mains 2023 session 2 result’ link.
➤☛ Enter the application number, password and security pin.
➤☛ JEE Main 2023 result will be displayed on the screen.
➤☛ Download the JEE Main result session 2 and save a copy for future reference.

జేఈఈ మెయిన్‌ ఫలితాల‌ కోసం రీవాల్యూయేషన్‌, రీ చెకింగ్‌ లాంటివి ఉండవని, కాబట్టి అభ్యర్థులు సంప్రదించేందుకు ప్రయత్నించకూడదని సూచించింది ఎన్‌టీఏ. జేఈఈ మెయిన్స్‌ సెషన్‌ 1 పరీక్ష జనవరిలో జరిగింది. ఏప్రిల్‌ 6 నుంచి 15 రెండో విడత జరిగాయి. మొదటి విడత పరీక్షకు 8.24 లక్షల మంది, రెండో విడత పరీక్షకు దాదాపు 9 లక్షల మంది హాజరయ్యారు. ఈ రెండుసార్లు పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన అభ్యర్థుల ఉత్తమ స్కోర్‌ ఆధారంగానే ఎన్‌టీఏ ర్యాంకులు ప్రకటించింది. జేఈఈ మెయిన్స్‌లో కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులు నిర్ణయించి.. మొత్తం 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత కల్పిస్తారు. 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీ ఇదే..

jee advanced 2023 exam date

ఏప్రిల్‌ 30వ తేదీ నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. మే 7వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. అప్లికేషన్‌ ఫీజును మే 8వ తేదీ వరకు చెల్లించవచ్చు. మే 29 నుంచి జూన్‌ 4వ తేదీ వరకు అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జూన్‌ 4వ తేదీన ఉంటుంది.  ఉదయం 9-12గం. పేపర్‌ 1, మధ్యాహ్నం 2.30-5.30 మధ్య రెండో పేపర్‌ ఉంటుంది.

JEE Result 2023 Session 2 Direct Links :

☛ జేఈఈ మెయిన్స్‌ 2023 సెషన్‌-2 ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి (Click Here )

Published date : 29 Apr 2023 09:26AM

Photo Stories