JEE Mains Entrance Exam 2024: అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు
జాతీయ స్థాయిలో ఈ పరీక్షకు 12.3 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే అడ్మిట్ కార్డులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొంది. తొలి మూడు రోజులు బీఆర్క్ (పేపర్–1) నిర్వహిస్తారు.
చదవండి: JEE Main 2024: జేఈఈ మెయిన్స్‌కు సర్వం సిద్ధం.. ఈ మార్కులతో జాగ్రత్త
తర్వాత రోజుల్లో ఇంజనీరింగ్ విభాగానికి పరీక్ష ఉంటుంది. ఈసారి పరీక్ష కేంద్రాల వివరాలను ముందే వెల్లడించారు. దీంతో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకుంటే బాగుంటుందని ఎన్‌టీఏ సూచించింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరో సెషన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష చేపడుతున్నారు.
చదవండి: Inspire Story : రైతు బిడ్డ.. 13 ఏళ్లకే ఐఐటీ.. 24 ఏళ్లకే యాపిల్ ఉద్యోగం.. కానీ..
నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రానికి అనుమతించరు. ప్రతి కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశా రు. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అనుసరిస్తు న్నారు. మధ్యలో బయటకు వెళ్లి వచ్చినా ఇది తప్పనిసరి. విద్యార్థులు ముందే డిజి లాకర్‌లో రిజి స్టర్ అవ్వాలి. ఈ సందర్భంగా ఎన్‌టీఏ విద్యార్థుల కోసం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.
అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- ఎ–4 సైజ్‌లో అడ్మిట్ కార్డును కలర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్‌లో అంటించిన పాస్‌పోర్టు ఫొటో ఒకటి పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు, రేషనల్ కార్డు, ఆధార్, గుర్తింపు పొందిన విద్యాసంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డుతో పరీక్ష కేంద్రానికి వెళ్లాలి. గుర్తింపు కార్డు లేకుంటే కేంద్రంలోకి అనుమతించరు. దివ్యాంగులు విధిగా సంబంధిత అధికారి జారీ చేసిన పత్రాలను వెంట తెచ్చుకోవాలి. వీరికి అదనంగా 20 నిమిషాలు పరీక్ష రాసేందుకు కేటాయిస్తారు.
- మీడియం, సబ్జెక్టుతో కూడిన ప్రశ్నపత్రంలో తప్పులుంటే తక్షణమే ఇన్విజిలేటర్ దృష్టికి తేవా లి. బీఆర్క్ పరీక్ష రాసే వారు అవసరమైన జామె ట్రీ బాక్స్, పెన్సిల్స్, ఎరేజర్, కలర్ పెన్సిల్స్, క్రెయాన్స్‌ను సొంతంగా సమకూర్చుకోవాలి.
- ఎలాంటి టెక్ట్స్ మెటీరియల్, పెన్సిల్స్‌ను భద్ర పరిచే బాక్సులు, హ్యాండ్‌బ్యాగ్, పర్సు, తెల్ల పేపర్లు అనుమతించరు. సెల్‌ఫోన్లు, మైక్రో ఫోన్లు, ఇయర్ ఫోన్లు, క్యాలిక్యులేటర్, వాచీలను హాళ్లలోకి తీసుకెళ్లే వీల్లేదు. పరీక్ష గదిలో అవ సరమైన తెల్ల పేపర్‌ను కేంద్రం నిర్వహకులే అందజేస్తారు. దీనిపై అభ్యర్థి రోల్ నంబర్ వేయాలి. పరీక్ష పూర్తయిన తర్వాత దీన్ని చెత్త బుట్టలో పడేయాల్సి ఉంటుంది. డయాబెటిక్ సహా అత్యవసర వైద్యానికి వాడే మందులను వెంట తెచ్చుకొనేందుకు మాత్రం అనుమతి ఉంది.