JEE Main: జేఈఈ మెయిన్ కఠినం..
ఉదయం పరీక్షలో గణితం కొంత సాను కూలంగా ఉందని శ్రీచైతన్య కళాశాల డీన్ డి.శంకర్‌రావు తెలిపారు. గతంలో మాదిరి సుదీర్ఘమైన సమస్యలు ఇవ్వకపోయినా సుల భంగా మార్కులు తెచ్చుకోగలిగేలా మాత్రం లేవన్నారు. కెమిస్ట్రీ విభాగం మునుపెన్నడూ లేనంత కఠినంగా ఉందని, ఫిజిక్స్‌లో కూడా ఎక్కువ మార్కులు స్కోర్ చేసేలా ప్రశ్నలు లేవని విద్యార్థులు పేర్కొన్నారు. సాయంత్రం పరీక్షలో గణిత విభాగం అత్యంత కఠినంగా ఉందని, సుదీర్ఘ సమస్యలు ఇవ్వడం వల్ల సమయం సరిపోలేదని కొందరు విద్యార్థులు తెలిపారు. ఫిజిక్స్‌లో కొంత సులువైనవి, కెమెస్ట్రీలో కొంత కఠినంగా ప్రశ్నలు ఇచ్చారని పేర్కొన్నారు. జేఈఈ మెయిన్కు ఈ సారి అభ్యర్థుల హాజరు పెద్దగా లేదని పరీక్ష కేంద్రాల నిర్వాహకులు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలవడంతో జేఈఈ మెయిన్క్ విద్యార్థులు ఆసక్తి చూపలేదని నిపుణులు అభిప్రాయపడ్డారు.
చదవండి:
జేఈఈ(మెయిన్)-2021 మీ సందేహాలు- సమాధానాలు ఇవే...
JEE(Main) Online Tests