JEE Main 2023: తుది కీ విడుదల .. నేడు ర్యాంకులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్) ప్రశ్నపత్రం తుది కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏప్రిల్ 24న విడుదల చేసింది.
తుది కీ ఇచ్చిన కొన్ని గంటల్లో ఎన్‌టీఏ ఫలితాలు, ర్యాంకులు విడుదల చేయడం సాధారణం. కానీ ఈసారి అర్ధరాత్రి వరకూ విడుదల చేయలేదు. ఫలితాలు ఏప్రిల్ 25న వచ్చే వీలుంది. రెండో దఫా మెయిన్ పరీక్ష ఏప్రిల్ 15తో ముగిసింది. జనవరిలో మొదటి విడత పరీక్ష నిర్వహించారు.
చదవండి: Admission: ఇంతలోపు ర్యాంకు వస్తేనే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశం
దీంతో అడ్వాన్స్‌కు వెళ్లే అర్హత మార్కుల కటాఫ్‌ను ఖరారు చేసే వీలుంది. జేఈఈ మెయిన్‌కు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది వరకూ హాజరయ్యారు. వీరిలో 2.5 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు వెళ్తారు. ఇందులో వచ్చే ర్యాంకును బట్టి ఐఐటీల్లో సీట్లు వస్తాయి.
☞ JEE Main – 2023 Session 2 Final Provisional Answer Key Out: Check Expected Cut-off Marks
Published date : 25 Apr 2023 01:55PM