Skip to main content

JEE Rankers and their Goals: జేఈఈ మెయిన్స్‌ పరీక్షలో ర్యాంకులు సాధించిన ఇంటర్‌ విద్యార్థులు.. వీరి లక్ష్యాలు ఇవే..!

వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ర్యాంకులను సాధించారు..
JEE Mains Rankers about their success and goals in life  rankers success stories

జాతీయ పరీక్షల విభాగం(ఎన్‌టీఏ) ఏప్రిల్‌ 24న అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచి ర్యాంకులు సాధించారు. అందులో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వివిధ జిల్లాల విద్యార్థులు తమ మనోగతాలను వెల్లడించారు.

ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతా..

                                                       


మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. ఆలిండియా ఓపెన్‌లో 8 కేటగిరి విభాగంలో 2వ ర్యాంకు సాధించాను. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. విశాఖలో ఇంటర్‌ (సీబీఎస్‌ఈ)చదివాను. పదో తరగతి సీబీఎస్‌ఈలో 472 మార్కులు సాధించాను. పదో తరగతిలోనే ఇంటర్‌ విద్యకు కావాల్సిన సబ్జెక్టులు గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రంలలో ముఖ్యమైన పాఠ్యాంశాలను అధ్యయనం చేశాను. ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించడానికి ప్రణాళిక రూపొందించుకొని చదివాను. నిత్యం 14 గంటలకుపైగా చదివేవాడిని. ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతాను.

-చింతు సతీష్‌కుమార్‌, 8వ ర్యాంకు

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావడమే లక్ష్యంగా..

                                                       

 

నాకు దేశంలోనే 9వ ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. మేము విశాఖలోని 92వ వార్డు ఇందిరానగర్‌లో ఉంటున్నాం. మా నాన్న డిఫెన్స్‌ సివిలియన్‌గా పని చేస్తున్నారు. అమ్మ గృహిణి. చిన్నప్పటి నుంచి పట్టుదలతో అన్ని పాఠ్యాంశాలు శ్రద్ధగా చదివేవాడిని. సరైన ప్రణాళిక, నిరంతర సాధనతోనే మంచి ర్యాంకు వచ్చింది. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడాలని ఉంది.

-రెడ్డి అనిల్‌, 9వ ర్యాంకు

అంకుర సంస్థలు స్థాపిస్తాను..

                                                     

మాది అనంతపురం జిల్లా ఎన్‌పీ కుంట. నాకు 15వ ర్యాంకు వచ్చింది. ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్‌ తీసుకున్న తర్వాత ఐఐటీ బాంబేలో చదవాలని అనుకున్నా. 8వ తరగతి నుంచే ఇంజినీరింగ్‌ చదువుపై ఆసక్తి కలిగింది. ప్రతి సబ్జెక్టులో ముఖ్యాంశాలను రాసుకుని, వాటిని పదేపదే చదువుకున్నా. ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష రాశా. మా నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ గృహిణి. చదువు పూర్తయ్యాక అంకుర సంస్థలను స్థాపించాలని అనుకుంటున్నా.

-మురికినాటి దివ్యతేజరెడ్డి, 15వ ర్యాంక్‌

ఐఏఎస్‌ కావడమే లక్ష్యంగా..

                                                      

మాది కడప పట్టణం. నాకు 24వ ర్యాంకు వచ్చింది. నాన్న జైళ్ల శాఖలో అధికారిగా పనిచేస్తున్నారు. కడపలోనే పదో తరగతి వరకు చదివాను. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం నుంచే ప్రణాళిక ప్రకారం సిలబస్‌ను పూర్తి చేయడం, పునశ్చరణ చేయడంతో పాటు అన్ని అంశాలపై అవగాహన పెంచుకున్నా. ఐఐటీ బాంబేలో చదువు పూర్తిచేశాక ఐఏఎస్‌ సాధించాలన్నదే నా లక్ష్యం.

-తవ్వా దినేష్‌, 24వ ర్యాంక్‌

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలనేదే లక్ష్యంగా..

                                                         

ఆలిండియా ఓపెన్‌ కేటగిరిలో 39వ ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. మాది ప్రకాశం జిల్లా. నాన్న వ్యాపారి. అమ్మ గృహిణి. హైదరాబాద్‌లో ప్రైవేట్‌ సంస్థలో శిక్షణ తీసుకున్నా. సందేహాలను ఎప్పటికప్పుడు అధ్యాపకులతో నివృత్తి చేసుకున్నా. ఐఐటీలో చేరి, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలన్నదే లక్ష్యం.

-రితేష్‌ బాలాజీ, 39 ర్యాంక్‌

Published date : 29 Apr 2024 10:50AM

Photo Stories