JEE Main Results 2023: ఈ నెల 29న జేఈఈ మెయిన్ ఫలితాలు!
జేఈఈ మెయిన్‌లో కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హత కల్పిస్తారు. జూన్ 4వ తేదీ నిర్వహించనున్న పరీక్ష రాయడానికి ఏప్రిల్ 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుందని ఐఐటీ గౌహతి ప్రకటించింది. దీంతో ఏప్రిల్ 29న జేఈఈ మెయిన్ పేపర్-1 ర్యాంకులు వెల్లడించే అవకాశముంది. జనవరిలో జరిగిన తొలివిడత జేఈఈ మెయిన్‌కు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 8.24 లక్షల మంది పరీక్ష రాశారు. చివరి విడతకు (పేపర్-1, 2) 9.40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చు.
చదవండి: 20 ప్రశ్నలకు అరలీటర్ నీటిని వాడేస్తున్న చాట్ జీపీటీ... ఎందుకంటే
అడ్వాన్స్‌డ్ రాసేందుకు 2022 మెయిన్‌లో కటాఫ్ స్కోర్ ఇలా..
- జనరల్ (అన్ రిజర్వుడ్): 88.412
- ఈడబ్ల్యూఎస్: 63.111
- ఓబీసీ: 67.009
- ఎస్‌సీ: 43.082
- ఎస్‌టీ: 26.777