మార్కులు ప్రధానం కాదు.. అవగాహన కీలకం
Sakshi Education
మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య, ఉద్యోగావకాశాలు.. భవిష్యత్ చిత్రాన్ని ప్రభావితం చేస్తుందని భావిస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అంశాలపై ప్రోగ్రెస్ సాఫ్ట్వేర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ రమేష్ లోగనాథన్తో ప్రత్యేక ఇంటర్వ్యూ..
ఉపాధికి ఢోకా లేదు:
ఐటీ రంగంలో, ప్రత్యేకించి హైదరాబాద్‌లో ఉపాధి పరంగా అవకాశాలు తగ్గుతున్నాయనడంలో ఎటువంటి వాస్తవం లేదు. ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమ రెవెన్యూ 26 శాతం పెరిగింది. ఈ ప్రభావం కొత్త ఉద్యోగల కల్పనలో కనిపిస్తుంది. ఈనేపథ్యంలో ఉపాధి పరంగా ఢోకా లేదని చెప్పొచ్చు.
నైపుణ్యాలను పెంచుకోవాలి:
మన దగ్గర 750 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి ఏడాది వీటిల్లోంచి దాదాపు లక్షా యాభైవేల మంది గ్రాడ్యుయేట్లు బయటికి వస్తున్నారు. కానీ జాబ్ మార్కెట్ పరంగా చూస్తే కొత్తగా 30 నుంచి 40 వేల ఉద్యోగాల కల్పన మాత్రమే జరుగుతోంది. కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి.. నైపుణ్యాలను పెంచుకోవడంతోపాటు ఇతర పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా వ్యూహాలు రచించుకోవాలి.
రెజ్యూమె బలోపేతం:
ఇంజనీరింగ్ విద్యార్థికి సంబంధించి మార్కులు ప్రధానం కాదు. అవగాహన స్థాయి ముఖ్యమనే విషయాన్ని గమనించాలి. రోబోటిక్ కాంపిటీషన్స్‌లో పాల్గొనడం, కోడింగ్-డీకోడింగ్ వంటి టెక్నికల్ ఈవెంట్లలో పాల్గొనడం వంటి అంశాలు ఆ విద్యార్థి రెజ్యూమెను బలోపేతం చేస్తాయి. అటువంటి అభ్యర్థిని రిక్రూట్ చేసుకునేందుకు ఎక్కువ శాతం మంది ఆసక్తి చూపుతారు. ఈ విషయాన్ని గమనించి విద్యార్థులు అవగాహన స్థాయిని మెరుగుపరుచుకోవాలి. అంతేకాకుండా ఎంతో కీలకమైనసాఫ్ట్ స్కిల్స్‌ను పెంచుకోవాలి.
ప్రాజెక్ట్ వర్క్ కీలకం:
ఇంజనీరింగ్ విద్యార్థికి ప్రాజెక్ట్ వర్క్ ఎంతో కీలకమైంది. ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభానికి ముందే కొంత కసరత్తు చేయాలి. ఇందుకు మూడో ఏడాది వేసవి సెలవుల్లో.. ఎటువంటి ప్రాజెక్ట్‌ను ఎంచుకోవాలి? ఏవిధంగా చేయాలి? అనే అంశాలపై దృష్టి సారించాలి. ఇందుకోసం మన చుట్టూ ఉన్న పరికరాలనే తీసుకోవాలి. ఉదాహరణకు ఒక ఎలక్ట్రానిక్ క్లాక్ తీసుకుంటే.. దాని అనువర్తనాలను, దాన్ని మరొక విధంగా రూపొందించవచ్చా? అనే అంశాలను పరిశీలించండి. ఈ విషయంలో ఒక్కోసారి విఫలం కావచ్చు. కాకపోతే కొంత ప్రయత్నం చేశామనేది ముఖ్యం అనే విషయాన్ని గమనించాలి. తద్వారా పొందే అవగాహన ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రాజెక్ట్ వర్క్‌లో ఒకే కాన్సెప్ట్/టెక్నాలజీ మీద మూడు రకాల ప్రాజెక్ట్‌లను చేయడం మంచిది. ఎక్కడి నుంచో కాపీ చేసింది కాకుండా సొంతంగా ప్రాజెక్ట్ వర్క్ చేపట్టాలి. తద్వారా సబ్జెక్ట్‌పై పట్టు పెరుగుతుంది. ప్రాజెక్ట్ వర్క్ టాపిక్ ఎంపిక కోసం ఇంటర్నెట్ లేదా స్నేహితులు, ఫ్యాకల్టీల సలహాలను తీసుకోవచ్చు.
క్లౌడ్ కంప్యూటింగ్:
క్లౌడ్ కంప్యూటింగ్ అనేది నూతన టెక్నాలజీ ఏమి కాదు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలకు సంబంధించిన నైపుణ్యతగా దీన్ని పేర్కొనవచ్చు. ఉదాహరణకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ప్రభుత్వ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియలో ఎంతో డేటాను నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక లోకల్ సర్వర్ అవసరమవుతుంది. అలా కాకుండా ఇంటర్నెట్లో అందుబాటులో ఉండే రిమోట్ సర్వర్స్ ద్వారా డేటాను నిల్వ చేయవచ్చు. ఈ ప్రక్రియనే క్లౌడ్ కంప్యూటింగ్. ఏదైనా మెషిన్ లేదా సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసే బదులు, ఇంటర్నెట్ ద్వారా వర్చువల్ మెషిన్స్ సహాయం తీసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ అవసరం లేకుండానే క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా అప్లికేషన్‌ను రూపొందించవచ్చు.
దాదాపుగా లక్ష ఉద్యోగాలు:
క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ విధానం ద్వారా కంపెనీల క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. అధిక సంఖ్యలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఈ చర్య దోహదం చేస్తుంది. తద్వారా అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావచ్చు. దాదాపుగా లక్ష ఉద్యోగాలు ఈ రంగంలో వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్ విద్యార్థులకు ఈ రంగం అనువుగా ఉంటుంది.

Published date : 10 Oct 2013 05:57PM