Skip to main content

TS ICET 2022 : ఐసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు.. చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం (2022–2023)లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అపరాధ రుసుము లేకుండా జూలై 4వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు తెలంగాణ ఐసెట్‌ కన్వీనర్‌ కె.రాజిరెడ్డి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.
TS ICET 2022
TS ICET 2022 Application

ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా జూలై 27తో(సోమవారం) గడువు ముగియడంతో మరోసారి పొడిగించినట్లు పేర్కొన్నారు. టీఎస్‌ ఐసెట్‌ను జూలై 27, 28 తేదీల్లో మూడు సెషన్‌లలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ సారి ఐసెట్‌ నిర్వహణ బాధ్యతలను కాకతీయ యూనివర్సిటీ తీసుకుంది. ఏప్రిల్‌ 6 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

Also read: ICET Study Material Mathematical Ability

అర్హతలు: 
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఎంసీఏ కోర్సు అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్‌ గ్రూప్‌ సబ్జెక్ట్‌గా ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Also read: Model Papers

ఈ ఏడాది కీల‌క మార్పులు..
ఈ ఏడాది టీఎస్‌ ఐసెట్‌లో కీలక మార్పులు చేశారు. మూడు విభాగాలుగా నిర్వహించే ఈ పరీక్షలో.. రెండో విభాగం(పార్ట్‌–బి)లో ఆల్‌జీబ్రకల్‌ అండ్‌ జామెట్రికల్‌ ఎబిలిటీలోని కొన్ని అంశాలను, అదే విధంగా స్టాటిస్టికల్‌ ఎబిలిటీలోని పలు అంశాలను తొలగించారు. ముఖ్యంగా స్టాటిస్టికల్‌ ఎబిలిటీలో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్, స్టాండర్డ్‌ డీవియేషన్, కొరెలేషన్‌ టాపిక్స్‌ తొలగించారు. ఇది ఏదైనా డిగ్రీ అర్హతగా నిర్వహించే ఐసెట్‌లో..నాన్‌–మ్యాథ్స్‌ విద్యార్థులకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.

Also read: Study Material

అంశాల వారీగా మార్కులు ఇలా..
ఈ ఏడాది ఐసెట్‌ నోటిఫికేషన్‌ సమయంలోనే.. పరీక్ష విభాగాలు.. ఆయా విభాగాలకు కేటాయించిన మార్కులు.. సదరు విభాగాల నుంచి అడిగే అంశాలు–వాటికి కేటాయించిన మార్కులను కూడా ముందుగానే ప్రకటించారు.  దీని ఫలితంగా అభ్యర్థులు ఆయా అంశాలకు కేటాయించిన మార్కులను బట్టి, వాటికి పరీక్షలో లభించే వెయిటేజీని గుర్తించి.. ప్రిపరేషన్‌ ప్రణాళిక రూపొందించేందుకు అవకాశం లభిస్తోంది. తమకు పట్టున్న విభాగాలకు కేటాయించిన మార్కులకు అనుగుణంగా అందులో మరిన్ని ఎక్కువ మార్కులు సొంతం చేసుకునేలా సన్నద్ధమయ్యే అవకాశం కూడా లభించనుంది.

Also read: ICET Study Material Analytical Ability

మూడు విభాగాలు.. 200 మార్కులు..

టీఎస్‌–ఐసెట్‌ 2022ను మూడు సెక్షన్లుగా 200 మార్కులకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. అదే విధంగా ప్రతి సెక్షన్‌లో ఉప విభాగాలు కూడా ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. మొదటి, రెండు విభాగాల్లో 75 మార్కులకు, మూడో విభాగంలో 50 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష విధానాల వివరాలు..

విభాగం–ఎ  ప్రశ్నలు మార్కులు
ఉప విభాగం–1: 
డేటా సఫిషియన్సీ
20 20
ఉప విభాగం–2:
ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ 
 55 55

విభాగం–బి    మ్యాథమెటికల్‌ ఎబిలిటీ

ఉప విభాగం: అర్థమెటికల్‌ ఎబిలిటీ 35 35
ఉప విభాగం: అల్జీబ్రా అండ్‌ జామెట్రికల్‌ ఎబిలిటీ 30 30
ఉప విభాగం: స్టాటిస్టికల్‌ ఎబిలిటీ 10 10

విభాగం–సి    కమ్యూనికేషన్‌ ఎబిలిటీ

ఉప విభాగం: మీనింగ్స్‌ 5 5
ఉప విభాగం: సినానిమ్స్‌ అండ్‌ యాంటానిమ్స్‌ 5 5
ఉప విభాగం: వెర్బ్‌ 5 5
ఉప విభాగం: ఫ్రేజల్‌ వెర్బ్‌ అండ్‌ ఇడియమ్స్‌ 5 5
ఉప విభాగం: ఆర్టికల్స్‌ అండ్‌ ప్రిపొజిషన్స్‌ 5 5
ఉప విభాగం: కంప్యూటర్‌ టెర్మినాలజీ 5 5
ఉప విభాగం: బిజినెస్‌ టెర్మినాలజీ 5 5
ఉప విభాగం: కాంప్రహెన్షన్‌ 3 15

విభాగాల వారీగా.. మార్కులు..

  • విభాగం–ఎ: డేటా సఫిషియన్సీ–20 ప్రశ్నలు–20 మార్కులు; ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ విభాగంలో.. సిరీస్‌ టాపిక్‌ నుంచి 25 ప్రశ్నలు; డేటాఅనాలిసిస్‌ నుంచి 10 ప్రశ్నలు; కోడింగ్‌ అండ్‌ డీ కోడింగ్‌ ప్రాబ్లమ్స్‌ నుంచి 10ప్రశ్నలు; డేట్, టైమ్‌ అండ్‌ అరేంజ్‌మెంట్‌ నుంచి 10 ప్రశ్నలు ఉంటాయి.
  • విభాగం–బి: మ్యాథమెటికల్‌ ఎబిలిటీగా పేర్కొనే విభాగం–బిలో.. అర్థమెటికల్‌ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు; అల్జీబ్రకల్‌ అండ్‌ జామెట్రికల్‌ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు; స్టాటిస్టికల్‌ ఎబిలిటీ నుంచి 10 ప్రశ్నలు అడుగుతారు.
  • విభాగం–సి: కమ్యూనికేషన్‌ ఎబిలిటీగా పేర్కొనే విభాగం– సి నుంచి పైన పేర్కొన్న టేబుల్‌ ప్రకారమే అంశాలు, ప్రశ్నలు అడుగుతారు. 

Higher Education: ఎంబీఏలో చేరాలా.. లేదా ఎంసీఏ బెటరా?!

Published date : 28 Jun 2022 03:03PM

Photo Stories