Skip to main content

AP ICET: 26 కళాశాలల్లో ఒక్కరు కూడా చేరలేదు

రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో విద్యార్థుల చేరికలు నానాటికీ పడిపోతున్నాయి.
AP ICET
26 కళాశాలల్లో ఒక్కరు కూడా చేరలేదు

ఏపీ ఐసెట్‌–2021 కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో తొలివిడత సీట్ల కేటాయింపును అడ్మిషన్ల కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె.రామ్మోహనరావు డిసెంబర్‌ 29న ప్రకటించారు. ముందుగా ఎంబీఏ విషయానికొస్తే.. ఈ విద్యా సంవత్సరం ఐసెట్‌ కౌన్సెలింగ్‌లో కేవలం 25 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 75 శాతం మేర సీట్లు ఖాళీగా మిగిలాయి. రాష్ట్రంలో మొత్తం 303 ఎంబీఏ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 26 కళాశాలల్లో ఒక్కరు కూడా చేరలేదు. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఐసెట్‌ రాసేందుకు దరఖాస్తు చేసుకుంటున్నవారు అంతంతమాత్రంగానే ఉండటమే దీనికి కారణం. ఇక ప్రవేశపరీక్షలో అర్హత సాధించే వారి సంఖ్య మరీ తక్కువగా ఉంటోంది. ఉత్తీర్ణులైనవారిలోనూ కౌన్సెలింగ్‌కు హాజరవుతోంది కొందరే. ఇక సీట్లు పొందాక కళాశాలల్లో చేరేవారూ తక్కువగానే ఉంటున్నారు.

చదవండి: 

Higher Education: ఎంబీఏలో చేరాలా.. లేదా ఎంసీఏ బెటరా?!

ICET: ఐసెట్‌లో టాపర్‌ల వివరాలు..

Published date : 30 Dec 2021 01:13PM

Photo Stories