కేయూ క్యాంపస్: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు గాను 2023–24 విద్యాసంవత్సరానికి నిర్వహించనున్న టీఎస్‌ఐసెట్ దరఖాస్తు గడువు మే 6తో ముగియనుంది.
టీఎస్‌ఐసెట్ దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..
రూ.250 అపరాధ రుసుముతో మే 12 వరకు, రూ.500 అపరాధ రుసుముతో 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌ఐసెట్ కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ కామర్స్‌అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ పి.వరలక్ష్మి మే 4న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మే 12 నుంచి 15వరకు ఏమైనా సవరణలు ఉంటే సరిచూసుకోవచ్చని తెలిపారు.